STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 11th October 2018
Markets_main1539231320.png-21034

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబంధ సంస్థ అదానీ అగ్రో లాజిస్టిక్స్‌ సంస్థను విలీనం చేసుకుంది.
పీటీసీ ఇండియా:- బంగ్లాదేశ్‌కు 15ఏళ్ల పాటు 200 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆదేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సీఎల్‌ ఎడ్యుకేట్‌:- అమెజాన్‌ అలెక్సా పవర్‌తో వ్యాపార ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది.
జీఈ పవర్‌:- వడోదరా, షాహాబాద్‌ యూనిట్లను విస్తరించేందుకు కమిటిని ఏర్పాటు చేసింది.
ఆయిల్‌ ఇండియా:- డిబ్రూగర్ & టిన్సుకియా జిల్లాలలో రెండు హైడ్రోకార్బన్‌ బావులను కనుక్కోన్నట్లు ప్రకటించింది.
మెట్రో గ్లోబల్‌:- కొనుగోలుదారులతో వివాదాలను పరిష్కారం చేసుకుంది.
ఐటీఐ లిమిటెడ్‌:- రాజస్థాన్‌లో 40వేల వైఫై-హాట్‌ స్పాట్‌లను ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో రూ.500 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
భరత్‌ గేర్స్‌:- కంపెనీ మూలధనం నుంచి రూ.60కోట్లు ఖర్చు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
భారత్‌ డైనమిక్స్‌:- ఎయిర్‌ మిస్సైల్‌ సరఫరా నిమిత్తం డీఆర్‌డీఓ నుంచి రూ.200 కోట్ల ఆర్డరు దక్కించుకుంది.
ఉషా​ మార్టిన్‌:- ఉక్కు వ్యాపారాన్ని టాటా స్టీల్‌కు విక్రయించేందుకు వాటాదార్ల ఆమోదం కోరనుంది. ఇందుకోసం వచ్చే నెల 10న అసాధారణ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
భారత్‌ ఫోర్జ్‌, ఎన్‌టీపీసీ:- ఇరు కంపెనీల భాగస్వామ్యంలో ఏర్పాటైన ‘‘బీఎఫ్‌ - ఎన్‌టీపీసీ’’ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు తెలిపాయి. 2008లో ప్రారంభమైన ఈ సంస్థ.. ఇప్పటివరకు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించలేదు. ఈ సంస్థలో భారత్‌ ఫోర్జ్‌కు మెజారిటీ వాటా ఉంది.
సిండికేట్‌ బ్యాంక్‌:- మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్లు 8.40శాతం నుంచి 8.50శాతానికి పెరిగింది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు:- టీసీఎస్‌, జీఎం బేవరీజెస్‌.You may be interested

ఆమ్రపాలి గ్రూప్ స్థిరాస్తులకు తాళాలు

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌నకు చెందిన 9 ప్రాపర్టీలకు సీల్ వేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రూప్‌లోని 46 సంస్థల కీలక పత్రాలు ఆయా ప్రాపర్టీల్లో ఉన్నాయంటూ కంపెనీ డైరెక్టర్లు తెలిపిన మీదట అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిరాస్తులు నోయిడా, గ్రేటర్ నోయిడా, బీహార్‌లోని రాజ్‌గిర్‌, బక్సర్‌లో ఉన్నాయి. తొమ్మిది ప్రాపర్టీలకు సీల్ వేసిన తర్వాత తాళం చెవులను సుప్రీం కోర్టు

38 శాతం తగ్గిన జీ ఎంటర్‌టైన్మెంట్‌ లాభం

Thursday 11th October 2018

న్యూఢిల్లీ:  జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జడ్‌ఈఈఎల్‌) నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 38 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.625 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.386 కోట్లకు తగ్గిందని జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,785 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.2,035 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్‌ గోయెంకా

Most from this category