STOCKS

News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 15th April 2019
Markets_main1555301081.png-25123

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వోకార్డ్‌:- ఇటీవల ఔరంగబాద్‌లోని యూనిట్‌ను తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ యూనిట్‌కు నో అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చే‍్సంజీలకు సమాచారం ఇచ్చింది. 
జెట్‌ ఎయిర్వేస్‌:- ప్రమోటర్లు తనఖా పెట్టిన 5.19శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను ఏప్రిల్‌ 11న ఎస్‌బీఐక్యాప్స్‌ సొంతం చేసుకుంది. 
డాక్టర్‌ రెడ్డీస్‌:-  అమెరికాలో 42 అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు తెలిపింది. అయితే ఏఎన్‌డీఏల మార్కెటింగ్ పోర్ట్‌ఫోలియోను ఇంకా దక్కించుకోవాల్సి ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందని శనివారం తెలియజేసింది.
ఐటీఐ లిమిటెడ్‌:- గత ఆర్థిక సంవత్సరంలో రూ.2051 కోట్ల టర్నోవర్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇది గతేడాది పోలిస్తే 20శాతం అధికంగా ఉంది.  
దిక్సాన్‌ టెక్నాలజీస్‌:- పాడ్జెట్‌ ఎలక్ట్రానిన్స్‌ కంపెనీలో 50శాతం వాటాను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.
సుదర్శన్‌ కెమికల్స్‌ ఇండస్ట్రీస్‌:- ఇండస్ట్రీయల్‌ మిక్సింగ్‌ సెల్యూషన్స్‌ డివిజన్‌ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు జీఎంఎం ఫ్యూడర్‌ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
క్విక్‌ హీల్‌:- బై బ్యాక్‌ రికార్డు తేదిని ఏప్రిల్‌ 26గా నిర్ణయించింది. 
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- ఫుండా టీ కంపెనీలో వాటా ఉపసంహరణకు తన అనుబంధ సంస్థ బొరెల్లీ టీ హోల్డింగ్స్‌ కంపెనీతో షేర్‌ పర్చేజింగ్‌ ఒప్పందాన్ని కుదర్చుకుంది. 
టెక్స్‌మాక్‌ రైల్‌:- వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఏప్రిల్‌ 17న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
ఏపిఎల్‌ అపోలో ట్యూబ్స్‌:- శంకర బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌ను రూ.70 కోట్లకు సొంతం చేసుకుంది. 
నేడు క్యూ4 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీల వివరాలు 
హాత్‌వే కేబుల్స్‌ అండ్‌ డాట్‌ కామ్‌, నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌, మెక్‌ హోటల్స్‌, టీఆర్‌ఎఫ్‌, టాటా మెటాలిక్స్‌, సంఘీ కార్పోరేట్స్‌, ఇంటర్నేషనల్‌ ట్రావెల్స్‌ హౌస్‌, గుజరాత్‌ హోటల్స్‌, ధృవ్‌ ఎస్టేట్స్‌
ఇటీవల ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న మెట్రోపాలీస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు నేడు స్టాక్స్‌ ఎక్చే‍్సంజ్‌ల్లో లిస్ట్‌ కానున్నాయి.You may be interested

క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలతో దిశా నిర్దేశం..

Monday 15th April 2019

- రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌ ఫలితాలు ఈవారంలోనే.. - ఏప్రిల్‌ 18న జరిగే రెండో విడత పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - సోమవారం వెల్లడికానున్న డబ్ల్యూపీఐ, బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ డేటా - గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడి - ఈవారంలో 3 రోజులకే పరిమితమైన మార్కెట్‌ ట్రేడింగ్‌ ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి)

లాభాల ప్రారంభం

Monday 15th April 2019

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా లాభంతో 38,807 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 11,667 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కోలు 1-4 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-3 శాతం మధ్య

Most from this category