STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th October 2018
Markets_main1539318220.png-21069

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
టీసీఎస్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విధులు నిర్వర్తిస్తున్న పీఎస్‌ జయకుమార్‌ పదివీకాలాన్ని బ్యాంకు బోర్డు మరో ఏడాది పొడిగించింది.
సంభవ్‌ మీడియా:- గోద్రాలో కొత్తగా ‘‘టాప్‌ ఎఫ్‌ఎం’’ పేరుతో రేడియో ఛానెల్‌(93.1)ను ప్రారంభించింది.
విప్రో:- బ్రిటన్‌లో ‘‘ఇన్నోవేషన్‌ అండ్‌ టాలెంట్‌’’ హబ్‌ను ఆవిష్కరించింది.
తంగమయిల్‌ జూవెలరీస్‌:- కంపెనీ తమిళనాడులోని బంట్లగుండలో 33వ బ్రాంచ్‌ను ప్రారంభించింది.
కార్పోరేషన్‌ బ్యాంక్‌:- ప్రభుత్వానికి ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో 86.9కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
కర్ణాటక  బ్యాంక్‌:- హైదరాబాద్‌లో కంపెనీ 819వ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది.
యారో టెక్స్‌టైల్స్‌:- కంపెనీ ఎం&డీ పదవికి చంద్‌ అరోరా రాజీనామా చేశారు.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌:- కొత్తగా ఏర్పాటైన బోర్డు శుక్రవారం రెండోసారి సమావేశం కానుంది.
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను 0.05శాతం పెంచింది.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.65కోట్ల విలువైన వాణిజ్య పేపర్లను జారీ చేసింది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని కంపెనీలు:- హిందూస్థాన్‌ యూనిలివర్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, కర్ణాటక బ్యాంక్‌, టాటా స్పాంజ్‌ ఐరన్‌, క్వింటగ్రా సెల్యూషన్స్‌You may be interested

గామన్ చైర్మన్ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోండి

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సంస్థ గామన్ ఇండియా భారీ స్థాయిలో రుణాలు డిఫాల్ట్ అయిన నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ అభిజిత్ రాజన్ విదేశాలకు జారుకోకుండా పాస్‌పోర్టును జప్తు చేయాలని పాస్‌పోర్టు అధికారులను బ్యాంకులు కోరాయి. ఆయన పాస్‌పోర్టు వివరాలను కన్సార్షియంలో లీడ్ బ్యాంకరు.. అధికారులకు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గామన్ ఇండియాకి ఇచ్చిన సుమారు రూ. 7,000 కోట్ల రుణాలు ప్రస్తుతం నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారినట్లు వివరించాయి.

సీపీఎస్‌ఈల విలీనంపై కేంద్రం కసరత్తు

Friday 12th October 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) విలీనం, కొనుగోళ్ల ప్రక్రియను (ఎంఅండ్‌ఏ) ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్, లీగల్ సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంకా విలీనాలు, కొనుగోళ్లకు అనువైన సంస్థలను నిర్దిష్టంగా గుర్తించనప్పటికీ.. సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వివరించాయి. దీంతో పాలనా

Most from this category