STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 11th July 2018
Markets_main1531284470.png-18197

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
మియిండా ఇండస్ట్రీస్‌:- 2:1 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించింది.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- జూలై 13న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణంపై చర్చించనుంది.
యాక్సిస్‌ బ్యాంక్‌:- ఎండీ & సీఈవో పదవి కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసింది. 2018, డిసెంబర్‌ 31వ తేదితో శిఖాశర్మ పదవికాలం ముగుస్తుంది.
పీఎస్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- పీఎన్‌బీ&కార్లే గ్రూప్‌ పీఎన్‌బీలోని 51శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.
ఆంధ్రా బ్యాంక్‌:- ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ, క్యూఐపీ, ఎఫ్‌పీఓ పద్దతుల ద్వారా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎయిర్‌టెల్‌:- భారతీ డిజిటల్‌ నెట్‌వర్క్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఐడీబీఐ బ్యాంకు:- ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐటసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే వీలుంది.
కేఈసీ ఇంటర్నేషనల్‌:- సంస్థ రూ.1,357 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుంది.
ఎంబీఎల్‌ ఇన్ఫ్రా:- ప్రిఫరెన్షియల్‌ బేసిక్‌ పద్ధతిలో ప్రమోటర్లకు, ప్రమోటర్‌ గ్రూప్‌కు 6.30 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- రూ.20 కోట్ల విలువైన ఎన్‌సీడీ ఇష్యూను ప్రకటించింది.
క్రిధాన్‌ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ వీఎస్‌సీ రూ.74.2కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
జేవీఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌:- ఆదర్శ్‌ ఝున్‌ఝున్‌వాలా తనశా పెట్టారు.
హెచ్‌ఎఫ్‌సీఎల్‌:- బీబీఎన్‌ నుంచి రూ.583 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ:- సంస్థ కొత్త ఛైర్మన్‌గా కే.డీ.త్రిపాఠీ నియమితులయ్యారు.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఎంఐసీ ఎలక్ట్రిక్స్‌


TCS

You may be interested

లుపిన్‌, హెచ్‌పీసీఎల్‌ అవుట్‌!

Wednesday 11th July 2018

అక్టోబర్‌లో నిఫ్టీ పునర్‌వ్యవస్థీకరణ గోద్రేజ్‌కన్జూమర్‌ ప్రొడక్ట్స్, జేఎస్‌డబ్ల్యుస్టీల్‌ ఇన్‌ భారత్‌లో అత్యంత పాపులర్‌ సూచీ నిఫ్టీలోకి అక్టోబర్‌లో కొత్త చేరికలు, తీసివేతలు జరగనున్నాయి. నిఫ్టీ 100లో ఉండే కంపెనీల నుంచి ఫ్రీఫ్లోట్‌ క్యాపిటలైజేషన్‌, లిక్విడిటీ, సూచీలపై అవి చూపగల ప్రభావం ఆధారంగా నిఫ్టీ 50 సూచీలోకి తీసుకుంటారు. ఇలా తీసుకునే కంపెనీల స్టాకులకు డెరివేటివ్స్‌ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆరునెలల డేటా ఆధారంగా రెండు మార్లు నిఫ్టీలోకి ఈ కూడికలు తీసివేతలు చేస్తుంటారు.

5 పైసలు బలహీనపడిన రూపాయి

Wednesday 11th July 2018

10 గంటల సమయానికి 68.83 వద్ద ట్రేడింగ్‌ ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 5 పైసలు నష్టపోయి 68.87 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మరోసారి 69 దిశగా కదలాడుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు అమెరికా డాలర్లను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ కోల్పోయిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు

Most from this category