STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th December 2018
Markets_main1545106882.png-23016

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
టాటాస్టీల్‌:- జర్మన్‌ ఉక్కు దిగ్గజం థీస్సెన్‌క్రూప్‌ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి సీఈవోగా ఆండ్రియాస్‌ గాస్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ఏర్పాటు కాబోతున్న థీస్సెన్‌క్రూప్‌టాటాస్టీల్‌ బి.వి.కి సంబంధించిన మేనేజెమెంట్‌ బోర్డు సభ్యులను నియమించినట్లు టాటాస్టీల్‌ ఎక్చ్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది.
ఎన్‌ఎండీసీ:- ఐరన్‌ ఓర్‌ ధరలను పెంచింది. టన్ను లూప్‌ ఓర్‌ ధర రూ.3250 కోట్లు, ఫైన్స్‌ ఓర్‌ ధర రూ.2870లుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. పెంచిన ధరలను డిసెంబర్‌ 13న అమల్లోకి రానున్నాయి.
అశోక్‌బిల్డ్‌కాన్‌:- మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.150కోట్లను సమీకరించింది.
గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌:- వోరా సోప్స్‌ లిమిటెడ్‌ను విలీనం చేసుకునేందకు ఎన్‌సీఎల్‌టీ అనుమతులు దక్కించుకుంది.
బాంబే డైయింగ్‌:- దివాళ ప్రక్రియలో భాగంగా షేర్‌హోల్డర్లు ఇండోనేషియాలోని తన అనుబంధ సంస్థ ఫైవ్‌స్టార్‌ టెక్స్‌టైల్స్‌ ఇండోనేషియా వేలంపాట వేయడానికి కంపెనీ అనుమతినిచ్చింది.
గ్రాఫైట్‌ ఇండియా:- బెంగళూర్‌ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ ప్లాంట్‌ లైసెన్స్‌ను కర్ణాటక రాష్ట్రకాలుష్య నివారణ బోర్డు మరో రెండున్నరేళ్ల పాటు రెన్యూవల్‌ చేసింది.
ఎల్‌ఎఫ్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్స్‌:- ద్రవ్యలభ్యత కొరత కారణంగా డిసెంబర్‌ 17న డిబెంచర్‌ హోల్డర్లకు ఎన్‌సీడీలపై వడ్డీని చెల్లించడంలో విఫలమైంది.
మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ సర్వీసెస్:- ఇండియా రేటింగ్‌ సంస్థ కంపెనీ ఇటీవల ప్రకటించిన రూ.10వేల కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూకు రేటింగ్‌ను పెంచింది.
ఇన్ఫీభీమ్‌ అవెన్యూ:- సవిధా ఇన్ఫీసర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఐ ఇన్ఫీనియ్‌ గ్లోబుల్‌ ప్రైవేట్‌ లిమిట్‌లో 5శాతం వాటాను కొనుగోలు చేసింది.
రైట్స్‌:- డివిడెండ్‌ చెల్లింపునకు రికార్డు తేదిగా డిసెంబర్‌ 28గా నిర్ణయించింది
మాక్‌ హోటల్స్‌:- గోవా హోటల్స్‌లో జనవరి 1నుంచి అదనంగా మరో 160 గదులను కొత్తగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
కోటక్‌ బ్యాంక్‌:- ప్రమోటర్ల వాటా తగ్గింపు గుడువు వివాదంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కి బాంబే హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వెలువడింది.
పంజాబ్‌నేషనల్‌బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు తెలిపింది.



You may be interested

రూపీ పైపైకి..

Tuesday 18th December 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.34 వద్ద ట్రేడవుతోన్న ఇండియన్‌ కరెన్సీ ఇండియన్‌ రూపాయి సోమవారం లాభాలను మంగళవారం కూడా కొనసాగిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి లాభాలతో ప్రారంభమైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు పాలసీ రేట్ల సమావేశం నేపథ్యంలో డాలర్‌ బలహీనపడటం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో రూపాయి 71.34 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (సోమవారం) స్థాయి 71.55తో పోలిస్తే 0.30 శాతం లాభపడింది. ఇకపోతే

నిఫ్టీ 40 పాయింట్లు గ్యాప్‌డౌన్‌

Tuesday 18th December 2018

నష్టాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 10,850 దిగువకు నిఫ్టీ సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా డౌన్‌ సోమవారం లాభాలతో కళకళలాడిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,888 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల నష్టంతో 10,850 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,270 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 36,226 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది బెంచ్‌మార్క్‌

Most from this category