STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th April 2019
Markets_main1556252170.png-25352

వివిధ వార్తలకు అనుగుణంగా ప్రభావితమయ్యే కొన్ని షేర్ల వివరాలు 
అపోటెక్స్‌ ఇండస్ట్రీయల్‌:-
షేర్‌ విజభజనతో పాటు ప్రతి షేరుపై రూ.7.50ల వార్షిక డివిడెండ్‌ చెల్లింపునుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
ఓరియంటల్‌ హోటల్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతితో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ లేదా డెబిట్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మూలధన నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- అమెరికాలో కొత్తగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.   
నెస్లే ఇండియా:- గత ఆర్థిక సంవత్సరానికి రూ.10లు ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై రూ.23ల మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌:- అనుబంధ సంస్థ మ్యాట్రిక్‌ బిజినెస్‌లో 19.7శాతం వాటాను విక్రయించింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల జారీ చేసి రూ.5,040 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది
సీఈఎస్‌:- తన అనుబంధ సం‍స్థ సీఈఎస్‌ గ్లోబల్‌ ఐటీ సొల్యూషన్స్‌లో 30శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
క్విక్‌ హీల్‌:- బై బ్యాక్‌ ఆఫర్‌ పద్దతిలో ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు డ్రాఫ్ట్‌ లెటర్‌ను సెబీ సమర్పించింది.
అపోటక్స్‌ ఇండస్టీ‍్రస్‌:- 2:1 నిష్పత్తిలో షేర్ల విభజన చేపట్టనుంది. అంటే రూ. 10 ముఖ విలువగల ప్రతీ షేరునీ రూ. 5 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది.
రేమాండ్‌:- కంపెనీ కొత్త ఛైర్మన్‌గా రవి ఉప్పల్‌ నియమానికి బోర్డు ఆమోదం తెలిపింది.

నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని కంపెనీలు:- హీరో మోటోకార్ప్‌, యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఆదర్శ్‌ ప్లాంట్‌ ప్రొటెస్ట్‌, అతుల్‌, కార్బోరండమ్‌ యూనివర్శల్‌, క్లాసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, డెల్ట్రాన్‌, డీఐసీ ఇండియా, హిందూస్థాన్‌ అప్పీలైన్స్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్చే‍్సంజ్‌, లాయిడ్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, శిఖర్‌ లీజింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌, సుజన యూనివర్శల్‌ ఇండస్టీ‍్రస్‌, సుప్రీం పెట్రోకెమ్‌.You may be interested

డీజిల్‌ కార్లకు మారుతీ మంగళం!

Friday 26th April 2019

వచ్చే ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు బంద్‌ సూపర్‌ క్యారీ డీజిల్‌ వెర్షన్‌ సైతం నిలిపివేత న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి డీజిల్‌ వెర్షన్‌ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్‌6 ఉద్గార నియమావళికి అనుగుణంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్‌ కార్ల వాటా 23

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 26th April 2019

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 38,865 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,684 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన యాక్సిస్‌ బ్యాంక్‌ 2 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 764 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ

Most from this category