STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 3rd December 2018
Markets_main1543808569.png-22577

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు...
అటోరంగ షేర్లు:- పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, పెరిగిన ఇంధన ఖర్చులు, అధిక వడ్డీరేట్ల కారణంగా నవంబర్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే జరిగాయి. నెమ్మదించిన అమ్మకాల ప్రభావం నేడు ఆయా కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపవచ్చు.
విమానయాన రంగ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రోజురోజుకూ దిగివస్తున్న నేపథ్యంలో దేశీయ ఆయిల​ మార్కెటింగ్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ ధరలను 11శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశీయ విమానయాన కంపెనీలపై కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.8,327.83ల భారం తగ్గింది. ఈ ఏటీఎఫ్‌ ధరల తగ్గింపు నేడు విమానయాన కంపెనీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు.
మెర్క్యూ:- తన కన్జ్యూమర్‌ హెల్త్‌విభాగాన్ని ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌ కంపెనీనిక 3 బిలియన్‌ యూరోలకు విక్రయించింది.
సన్‌ ఫార్మా:- నిబంధనలకు విరుద్ధంగా ఓవర్సీ్‌స్‌లో నిధుల సమీకరించిన కేసుతో పాటు, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడిందనే అభియోగాలపై గతంలో నమోదైన కేసును మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ పున:ప్రారంభించడానికి సిద్ధమైనట్లు మార్కెట్‌లో వార్తలు వెలువడ్డాయి.
బయోకాన్‌:- శరీరంలో తెల్లరక్తకణాల వృద్ధికి సహకరించే ఫెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్‌ బయోసిమిలర్‌ విక్రయానికి యూరోపిన్‌ హెల్త్‌ యూనియన్‌ నుంచి అనుమతులు దక్కించుకుంది.
వోడాఫోన్‌:- కంపెనీ సీఈవోగా బలేష్‌శర్మను నియమించేందుకు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు దక్కించుకుంది.
లారస్‌ ల్యాబ్స్‌:- దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఆస్పేస్‌ ఫార్మాకేర్‌ భాగస్వామ్యంలో హెచ్‌ఐటీ వ్యాధి చికిత్సలో వాడే ఔషధాన్ని ఆ దేశమార్కెట్లో విడుదల చేయనుంది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- కంపెనీ మేనేజింగ్‌డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఎ.యస్‌. రవికుమార్‌ నియమితులయ్యారు. ఈయన మూడేళ్ల పాటు బ్యాంకుకు తన సేవలను అందించనున్నారు.
మైండ్‌ ట్రీ:- అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించే తన అనుబంధ సంస్థ మాగ్నెట్‌ 360 ఎల్‌ఎల్‌సీని వీలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ నుంచి అనుమతులు దక్కించుకుంది.
టీవీ టుడే నెట్‌వర్క్‌:- కంపెనీ సీఈవో పదవికి వివేక్‌ ఖన్నా రాజీనామా చేయడంతో కొత్త సీఈవో నియామక ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కేడిల్లా హెల్త్‌కేర్‌:- తన అనుబంధ సంస్థ జైడస్‌... ఊపిరితిత్తుల వ్యాధి చికిత్సలో వినియోగించే ‘‘టెరిఫ్లోనోమైడ్‌’’ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
యూనిటైడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- కంపెనీ సీఎఫ్‌ఓగా అశ్విన్‌ కుమార్‌ నియమితులయ్యారు.
మాంటే క్లారో ఫ్యాషన్స్‌:- రూ.55 కోట్ల బైబ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 10లక్షల ఈక్విటీషేర్లను ప్రతి షేరు రూ.550ల వద్ద ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. అలాగే కంపెనీ సీఎఫ్‌ఓగా రాజ్‌కపూర్‌ శర్మ నియమితులయ్యారు.You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 3rd December 2018

గతవారం లాభాల ముగింపు కొనసాగిస్తూనే సోమవారం మార్కెట్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. జీ –20 సదస్సు సందర్భంగా వాణిజ్య యుద్ధంపై అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. ఫలితంగా నేడు ఆసియామార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల వాతావారణాన్ని అందుకున్న ప్రధాన సూచీలైన నిఫ్టీ 10,900పైన, సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 234 లాభంతో 36429.07 వద్ద, నిఫ్టీ

టాప్‌ కంపెనీల్లో 95 శాతం రేపు కనుమరుగే!

Sunday 2nd December 2018

ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) ఇక ఎంత మాత్రం ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు కానే కావని, అవి ప్రధాన పెట్టుబడి సాధనాలుగా అవతరిస్తున్నాయని, అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు) మార్కెట్‌ను మించిన రాబడుల (ఆల్ఫా) కోసం వీటిని ఆశ్రయిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 2012 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ రూ.9 లక్షల కోట్ల నిధులను ఆకర్షిస్తే... ఏఐఎఫ్‌ల్లోకి వచ్చింది రూ.లక్ష కోట్లుగా ఉన్నట్టు ప్రముఖ వెల్త్‌, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్లు ఈటీమార్కెట్స్‌

Most from this category