STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 7th February 2019
Markets_main1549514586.png-24059

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం‍ ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌:- స్ట్రీలలో బెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే ఫూల్వెస్ట్‌రెంట్‌ ఇంజెక్షన్‌ విక్రయాలనికి ఏఎన్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
మెజెస్కో:- రైట్స్‌ ఇష్యూ ఆఫర్‌ ద్వారా షేర్ల విక్రయ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
గ్రాసీం ఇండస్ట్రీస్‌:- ఎన్‌సీడీలపై ఇక్రా రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను పెంచింది. ప్రస్తుతం ఎఎఎ(-)గా ఉన్న రేటింగ్‌ను ‘‘అవుట్‌ స్టాండింగ్‌’’ స్థిరత్వానికి పెంచింది.
అంజతా ఫార్మా:- బైబ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా ప్రతి షేరు కొనుగోలు ధరను రూ.1300లుగా నిర్ణయించింది.
ఆంధ్రా బ్యాంక్‌:- ఈ ఫిబ్రవరి నుంచి బీఎంపీఎల్‌ఆర్‌ రేటును 5బేసిన్‌ పాయింట్లును తగ్గించింది. సవరించిన వడ్డీరేట్ల ప్రకారం బేస్‌ రేట్‌ 9.5శాతంగానూ, బీఎంపీఎల్‌ రేట్‌ 13.9శాతంగా మారనున్నాయి.
ప్రభాత్‌ డైరీ:- డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల ప్రకటనను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.
జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌:- తమ సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంలో 0.25 శాతాన్ని రాయల్టీగా తమకు చెల్లించాలన్న ప్రతిపాదనపై ప్రమోటర్లు వెనక్కి తగ్గారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం వాయిదా పడింది. 9వ తేదీన జరగాల్సిన ఈ సమావేశం ఫిబ్రవరి 18న జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేడు క్యూ3 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
టాటామోటర్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అరబిందో ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, కేడిల్లా హెల్త్‌కేర్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా, గ్రాసీం ఇండస్ట్రీస్‌, హిందూస్తాన్‌ కన్‌స్ట్రక‌్షన్‌ కంపెనీ, ఇక్రాన్‌ ఇంటర్నేషనల్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఖాదీం ఇండియా.



You may be interested

ఆర్‌బీఐ పాలసీ...రెపో రేటు పావుశాతం కట్‌

Thursday 7th February 2019

రిజర్వుబ్యాంక్‌...మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా రెపో రేటును పావుశాతం తగ్గించింది. మూడురోజుల సమీక్షా సమావేశం అనంతరం గురువారం మధ్యాహ్నం ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెపో రేటును 6.25 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. 

స్వల్పలాభాలతో ఆరంభం

Thursday 7th February 2019

క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన సూచీలు గురువారం ఉదయం తిరిగి స్వల్పలాభాలతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 51 పాయింట్ల లాభంతో 37,026 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల పెరుగుదలతో 11,070 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం రిజర్వుబ్యాంక్‌ పరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇతర రంగాల షేర్లలో సన్‌ఫార్మా, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌,

Most from this category