STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 5th December 2018
Markets_main1543983639.png-22632

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:-
లుపిన్:- ప్రోస్టేట్‌ గ్రంథి చికిత్సలో వినియోగించి సిలోడిన్‌ ఔషధాలను అమెరికాలో విడుదల చేసింది.
కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌:- తన టైర్ల వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది.
అయిల్‌ ఇండియా:- మనదేశంలో మొదటిసారిగా రాజస్థాన్‌లోని ‘‘భాఘ్‌వాలా’’బావుల్లో సైక్లిక్‌ స్టీమ్‌ స్టిమ్యూలేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున క్రూడాయిల్‌ను వెలికితీసింది.
ట్రిగన్‌ టెక్నాలజీస్‌:- తన హోల్డింగ్‌ కంపెనీకి మధ్యంతర డివిడెండ్‌ను జారీ చేసింది.
టీసీఎస్‌:- డిజిటల్‌ అనుసంధానిత వినియోగ వ్యవహారాల కోసం ఇంటలిజెంట్‌ పవర్‌ ప్లాంట్‌ సెల్యూషన్స్‌ ఆవిష్కరించింది.
క్రిధన్‌ టెక్నాలజీస్‌:- అసోసియేట్‌ కంపెనీ విజయ్‌ నిర్మన్‌ మహారాష్ట్రలో హైవే నిర్మాణానికి సంబంధించి రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
యస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ:- చేతనా పబ్లికేషన్స్‌లో 51శాతం కొనుగోలుకు సంబంధించి రూ.58 కోట్ల చెల్లింపు గడువును డిసెంబర్‌ 31వరకు పొడిగించినట్లు కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
ఇండియాబుల్స్‌వెంచర్‌:- రూ.1500 కోట్ల కమ్‌పల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూకు అలామెంట్‌ కమిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇష్యూలో భాగంగా కంపెనీ విదేశీ ఇన్వెస్టర్లకు రూ.550ల ముఖవిలువ కలిగి 2.69 కోట్ల డిబెంచర్లను జారీ చేయనుంది.
ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ:- జనరల్‌ మేనేజర్‌గా సేవలు అందించిన ‘‘అతుల్‌ సాహీ’’కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించింది.
వీఎస్‌టీ టిల్లర్స్‌ ట్రాక్టర్స్‌:- వ్యక్తిగత కారణాలతో కంపెనీ సీఈవో పదవికి కేయు.సుబ్బయ్య రాజీనామా చేశారు.
మాగ్మా ఎలక్ట్రో క్యాస్టింగ్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ... కంపెనీకి గల రుణ సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకుని రేటింగ్‌ను సవరించింది.
మంధన ఇండస్ట్రీస్‌:- అమెరికా ఆధారిత కంపెనీ ఫార్మేషన్‌ టెక్స్‌టైల్స్‌ ఎల్‌ఎల్‌సీ రుణాన్ని చెల్లించడంలో విఫలమైనందుకు కంపెనీపై దివాళ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
ఇండియన్‌ గ్రీన్‌ రియాల్టీ:- ప్రమోటర్లు/నాన్‌ ప్రమోటర్లకు ఫ్రిపరెన్షియల్‌ బేసిన్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
ఎస్‌కేఎఫ్‌ ఇండియా:- కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈక్విటీ షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు డిసెంబర్‌ 21ని రికార్డు తేదిగా నిర్ణయించారు.
యాక్సిస్‌ క్యాపిటల్‌:- కంపెనీ ఎండీ&సీఈవో పదవికి ధర్మేంద్ర మెహతా రాజీనామాకు బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా మోటర్స్‌:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పీ ... టాటామోటర్స్‌ కంపెనీ రేటింగ్‌ను ‘‘బిబి’’ నుంచి ‘‘బిబి(నెగిటివ్‌)’’ సవరించింది.You may be interested

ఆర్‌బీఐ నుంచి వ్యవస్థలోకి రూ.10,000 కోట్లు

Wednesday 5th December 2018

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ నెల 6న వ్యవస్థలోకి రూ.10,000 కోట్ల నిధుల్ని తీసుకొచ్చి, లభ్యతను పెంచనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలియజేసింది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంవో) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత మార్కెట్లో ఏర్పడిన లిక్విడిటీ కొరతను తీర్చేందుకు ఆర్‌బీఐ గత నెల నుంచి ఓఎంవో ద్వారా వ్యవస్థలోకి నిధుల్ని పంపిస్తూ... లభ్యతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

రూపీ డౌన్‌

Wednesday 5th December 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయి పైకి వెళ్లడం వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే నేటి ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:05 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.31 శాతం తగ్గుదలతో 70.74 వద్ద ట్రేడవుతోంది. రూపాయి

Most from this category