STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st November 2018
Markets_main1541045443.png-21623

వివిధ వార్తల్లోని షేర్లకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..!
కోల్‌ ఇండియా:- వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ.4300 కోట్ల విలువైన షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించగా రూ.15.84 కోట్ల షేర్లకు స్పందన లభించింది. అంటే 106శాతం ఓవర్‌ సబ్‌స్క్రెబ్‌ అయిందన్న మాట.  ఓఎఫ్‌ఎస్‌ షేర్ల జారీ భాగంగా నేటి (నవంబర్‌ 1న) నుంచి 3.96ఈక్విటీ షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నారు.
ఐఎల్‌ & ఎఫ్‌ఎస్‌:- ఎన్‌సీఎల్‌టీకి నివేదికను జారీ చేసింది. వచ్చే 6-9 నెలల్లో రివెల్యూషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుందని బోర్డు అంచనా వేస్తుంది.
శ్రీరాం ఈపీసీ:- ఝార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి రూ.236 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ:- తన అనుబంధ సం‍స్థ రాజ్‌ వెస్ట్‌పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంకు ధీర్ఘకాలిక రుణసౌకర్యాల దృష్ట్యా కంపెనీ రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్‌ సంస్థ  ఎఎ(+)స్థిరత్వం నుంచి ఎఎ(-)కు సవరించింది.
యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ప్రిఫరెన్షియల్‌ పద్దతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3000 కోట్లకు మించకుండా రుణాన్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సమీకరించిన రుణాన్ని కంపెనీ సాధారణ కార్పోరేట్‌ వ్యవహారాలకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా:- మైత్రి మూవీస్‌ భాగస్వామ్యంలో ‘‘సవ్యసాచి’’ సినిమాను నవంబర్‌ 2న చేయనుంది.  
ఐషర్‌ మోటర్స్‌:- సమ్మె కారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కేవలం 25వేల మోటర్‌ సైకిళ్లను మాత్రమే విడుదల చేసింది.
వా టెక్‌ వబాగ్‌:- మధ్య పశ్చాత్య దేశాల నుంచి రూ.1000 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
నేడు క్యూ2 ఫలితాలను విడుదల చేసే కొన్ని ప్రధాన కంపెనీలు:-
హెచ్‌డీఎఫ్‌సీ, మారికో, హెచ్‌పీసీఎల్‌, డీఎల్‌ఎఫ్‌, జాన్సన్‌ కంట్రోల్‌, ఓరియంటల్‌ కార్బన్‌, మాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, గేర్‌వేర్‌ టెక్నికల్‌ ఫైబర్స్‌, లార్సర్‌ ల్యాబ్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, అపోలో మారికో సిస్టమ్స్‌, పరాగ్‌ మిల్స్‌ ఫుడ్స్‌, అవధ్‌ షుగర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, థామస్‌కుక్‌, వెలస్పన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, బర్గర్‌ పేయింట్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, జువారీ ఆగ్రో సిమెంట్స్‌, జువారీ గ్లోబల్స్‌, టోరెంటో, సుందరం ఫైనాన్స్‌, గ్లాక్సోస్మిత్‌లైన్‌ కన్జూ‍్యమర్‌ హెల్త్‌కేర్‌, హికాల్‌, గ్రావీస్‌ కాటన్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, క్లారియంట్‌ కెమికల్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, అరవింద్‌, తాన్లా సెల్యూషన్స్‌, హిందూజా వెంచర్స్‌, సెంచరీ ఎన్‌కాయ్‌.You may be interested

3వారాల కనిష్టం నుంచి పుత్తడి రికవరీ

Thursday 1st November 2018

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర 3వారాల కనిష్టస్థాయి నుంచి రీవకరీ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.00లకు ఔన్స్‌ పసిడి ధర 4డాలర్ల లాభపడి 1,219.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచమార్కెట్లల్లో లాభాల ర్యాలీతో పాటు బ్రెగ్జిట్‌ అంశంలో సానుకూలతల కారణంగా నేటి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఆరు ప్రధాన

నిఫ్టీ 50 పాయింట్లు గ్యాప్‌అప్‌

Thursday 1st November 2018

ప్రపంచ మార్కెట్ల సానుకూల ప్రభావంతో బుధవారంనాటి భారీ ర్యాలీకి కొనసాగింపుగా గురువారం గ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 206 పాయింట్ల పెరుగుదలతో 34,650 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల తగ్గుదలతో 10,442 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన ఇంజనీరింగ్‌ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో 4 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,350 వద్ద ప్రారంభమై నిఫ్టీ టాప్‌గెయినర్లలో ఒకటిగా

Most from this category