STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 9th October 2018
Markets_main1539058481.png-20945

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
కోల్‌ ఇండియా:- ఎన్‌ఎల్‌సీ ఇండియా సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
జేఎంసీ ప్రాజెక్ట్స్‌:- వివిధ మార్గాలలో రూ.514 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
ఎన్‌బీసీసీ:- జైపూర్‌లో ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌ పునర్నిర్మాణానికి రాజస్థాన్‌ ప్రభుత్వంతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మొత్తం ఒప్పందం విలువ రూ.250 కోట్లుగా ఉంది.
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌:- ఈ సెప్టెంబర్‌ సిమెంట్‌ అమ్మకాల్లో 32శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో 3.69 లక్షల మెగా టన్నుల సిమెంట్‌ను విక్రయించగా ఈ ఏడాది 4.88 లక్షల సిమెంట్‌ను అమ్మింది.
సద్భవన్‌ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌:- తన అనుబంధ సంస్థ ఒకటి ఎన్‌హెచ్‌ఎఐ నుంచి రూ.115.10 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
యాక్సిక్‌ బ్యాంక్‌:- కంపెనీ స్వతంత్ర్వ డైరెక్టర్‌గా ఆర్‌.మీనన్‌ రాజీనామా చేశారు.
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌:- మల్టీపుల్లర్‌ షేర్‌&స్టాక్‌ మ్యూచువల్‌ కంపెనీ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన 5లక్షల షేర్లను ప్రతి షేరు ధర రూ.75.35చొప్పున విక్రయించింది.
ఇన్ఫీభీమ్‌ అవెన్యూస్‌:- నోమురా సింగపూర్‌ సంస్థ ఈ కంపెనీకి చెందిన 90లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.60.09 చొప్పున విక్రయించింది.
టాటా మోటర్స్‌:- టాటా మోటర్స్‌ జాగ్వర్‌ సెప్టెంబర్‌ అమ్మకాలు 4.4శాతం పెరిగి 19,146గా నమోదయ్యాయి. ఇదే సెప్టెంబర్‌లో జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ అ‍మ్మకాలు 12.3శాతం తగ్గి 57,114 యూనిట్లుకు, లాండ్‌రోవర్‌ అమ్మకాలు 18.8శాతానికి తగ్గి 37,968 యూనిట్లకు పరిమితయ్యాయి.



You may be interested

టెల్కోలకు రూపాయి దెబ్బ

Tuesday 9th October 2018

ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్‌ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్‌ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో

ఈ సారి షాపింగ్‌ ‘పండగే’!

Tuesday 9th October 2018

గతేడాది ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ సమయంలో ప్రమోద్‌ రూ.33,000 రూపాయిల మొబైల్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ పాత మొబైల్‌ ఫోన్‌ ఎక్సేంజ్‌పై అదనంగా రూ.3,000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయడాన్ని చూశాడు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.3,000 పెట్టి పాత మొబైల్‌ కొని దాన్ని ఎక్సేంజ్‌కు పెట్టాడు. ఆ మొబైల్‌కు ఈ కామర్స్‌ సంస్థ రూ.5,000 విలువ కట్టింది. అప్‌ఫ్రంట్‌ డిస్కౌంట్‌ కింద రూ.3,000 తగ్గింపు

Most from this category