STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 8th February 2019
Markets_main1549602634.png-24079

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వరుణ్‌ బేవరీజెస్‌:- మూడు రాష్ట్రాల్లో పెప్సీకో ఫ్రాంఛైజీస్‌ అనుమతులు దక్కించుకుంది.
సియట్‌ లిమిటెడ్‌:- తమిళనాడులోని హలోల్‌ ప్లాంట్‌లో బస్సు టైర్ల వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది.
సన్‌ఫార్మా అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌:- జీఎస్టీ అండ్‌ ఎక్సైజ్‌ కమిషన్‌ నుంచి రూ.46.04 కోట్ల సేవా పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీస్‌ను అందుకుంది.
శ్రీరాం ఈపీసీ:- నీటి సరఫరా విభాగంలో నిర్మాణాలకు సంబంధించిన జార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి రూ.291.6 కోట్ల విలువైన 3 ఆర్డర్లను దక్కించుకుంది.
హెచ్‌సీజీ:- అనుబంధ సంస్థ బీఎసీసీ హెల్త్‌లో తనకు ప్రస్తుతం ఉన్న 50.1శాతం వాటాను 100శాతం వాటాను పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రీకాల్‌:- వ్యాపార వ్యూహంలో భాగంగా తమిళనాడులోని ప్లాంట్‌లో ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అరబిందో ఫార్మా:- సినర్జీస్‌ రెమెడీలో 19.9 శాతం వాటాను రూ.15 కోట్లకు కొనుగోలు చేయనుంది.
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌:- కొత్త సీఈఓగా డా.అశుతోష్‌ రఘుంశీ నియమితులయ్యారు.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- బీపీసీఎల్‌, టాటాస్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సన్‌టీవీనెట్‌వర్క్స్‌, యూకో బ్యాంక్‌, ఆల్కేమ్‌ ల్యాబోరేటరీస్‌, ఐనాక్స్‌ విండ్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, ఇంజనీర్స్‌ ఇండియా, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, సనతా సాఫ్ట్‌వేర్‌, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, కేఆర్‌బీఎల్‌, ఎస్‌జేవీఎన్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌.You may be interested

రుణాలిక బిందాస్‌

Friday 8th February 2019

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ రివర్స్‌ రెపో కూడా ఇదే స్థాయిలో కోత ఇకపై తటస్థ విధానానికి సెంట్రల్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌ దాస్‌ నేతృత్వంలో నిర్ణయాలు గృహ, వాహన రుణాల వడ్డీ రేటు తగ్గే అవకాశం ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా

టాటామోటర్స్‌ 20శాతం క్రాష్‌..!

Friday 8th February 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో కంపెనీ భారీ నష్టాలను నమోదు చేయడంతో టాటామోటర్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 22శాతం పతనమైంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో కంపెనీ రూ.26,961 కోట్ల నికర నష్టాన్ని కనపర్చింది. కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం తొలిసారి కావడం. ఫలితాలు మార్కెట్‌ వర్గాల్ని తీవ్ర నిరాశపరచడంతో నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు గత ముగింపు(రూ.182.9)తో పోలిస్తే

Most from this category