News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 2nd January 2019
Markets_main1546400314.png-23352

వివిధ వార్తలకు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి
ఆటోరంగ కంపెనీలు నిన్న డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించిన వాహన విక్రయాల గ‌ణాంకాలు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో నేడు ఆయా కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై గ‌ణాంకాలు ప్రభావాన్ని చూప‌వ‌చ్చు.  
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌:- కంపెనీ ఛైర్మన్‌గా వీకే శ‌ర్మ రాజీనామా చేశారు.
గ్లెన్‌మార్క్ ఫార్మా:- తన యాక్టివ్ ఫార్మాస్యూటిక‌ల్ ఇంగ్రిడియెంట్(ఏపీఐ) వ్యాపారాన్ని అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ సైన్సెస్ లిమిటెడ్‌కు విజ‌య‌వంతంగా మార్చింది.
చంబ‌ల్ ఫెర్టిలైజ‌ర్స్ & కెమిక‌ల్స్‌:-  రాజ‌స్థాన్‌లోని గ‌డేప‌న్‌-3 యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తుల‌ను ప్రారంభించింది.
వీఎస్‌టీ టిల్లర్ ట్రాక్టర్స్:- ఈ డిసెంబ‌ర్‌లో కంపెనీ 1,353 యూనిట్ల ప‌వ‌ర్ టిల్లర్ల‌ను, 602 ట్రాక్టర్లు విక్రయించిన‌ట్లు ప్రక‌టించింది.
క‌ర్ణాట‌క్ బ్యాంక్‌:- స‌వ‌రించిన‌ ఎంసీఎల్ఆర్ రేట్లు జ‌వ‌వ‌రి 1నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.
బజాజ్ కార్పోరేష‌న్‌:- త‌న పేరును బ‌జాజ్ క‌న్జ్యూమ‌ర్ కేర్ లిమిటెడ్ గా మార్చారు.
నాట్కో ఫార్మా:-  ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ యూఎస్ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది.
శిల్పి మెడికేర్‌:- కాన్సర్ చికిత్సలో వాడే ఇరినోటికెన్ హెచ్‌సీఎల్ ఇంజెక‌్షన్ త‌యారీకి యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది.
ఎన్‌ఎండీసీ:- షేర్ల బై బ్యాక్‌ ఇష్యూలో ఈక్విటీ షేర్లను జనవరి 08 తారీఖు నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది.
కోల్‌ ఇండియా:- డిసెంబర్‌లో మొత్తం 54.13 మిలియన్‌ టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది.
వైజ్‌మెన్‌ ఫారెక్స్‌:- కంపెనీలో ప్రమోటర్లు తమ మొత్తం వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అదానీ ఇన్రా‍్ఫ:- ‘‘ఎన్‌సీడీల జారీ ద్వారా మూలధన సమీకరణ’’ అంశంపై చర్చించేందుకు జనవరి 04న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 2nd January 2019

సెన్సెక్స్‌ 150 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు డౌన్‌   ప్రతికూల ఆసియా సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల తగ్గుదలతో 36, 104 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల క్షీణతతో 10,858 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కోలు ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 5 శాతం నష్టపోయాయి. అలాగే ఆటోమొబైల్‌ షేర్లు మహింద్రా, ఐషర్‌ మోటార్స్‌,

2019లో ఎన్నో అవకాశాలు

Wednesday 2nd January 2019

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం... ఈ ఏడాది అయినా లాభాలు తీసుకోకపోతామా...? అనే ఆశ ఇన్వెస్టర్లలో సహజంగానే ఉంటుంది. అయితే, ఎక్కువ మంది అనలిస్టులు ఈ ఏడాది లాభాలకే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ధరలు భారీగా తగ్గడంతో ఆకర్షణీయంగా ఉన్నందున కొనుగోలుకు అవకాశంగానూ భావిస్తున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, సంవితి క్యాపిటల్‌ సహ వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ కుద్వా మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు ఈ దశలో

Most from this category