STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 11th March 2019
Markets_main1552281169.png-24526

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-
నిధుల సమీకరించడంలో విఫలమవడంతో  బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ సంస్థ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. కంపెనీకి చెందిన రూ.29వేల సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలపై రేటింగ్‌ను ఎఎ(+)నుంచి ఎఎ(స్థిరత్వం)కు కుదించింది.
అలోక్‌ ఇండస్ట్రీస్‌:- రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్‌స్ట్రక‌్షన్‌ కంపెనీ, జేఎం ఫైనాన్సియల్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ ధాఖలు చేసిన పరిష్కార ప్రక్రియకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌(​ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. 
శ్రద్ధా మోటర్స్‌ ఇండస్ట్రీస్‌:- ఇన్‌కార్పోరేషన్‌ పథకం కింద ఎన్‌డీఆర్‌ అటో కంపెనెంట్స్ లిమిటెడ్‌ ఏర్పాటుకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం ఫలితంగా సంస్థలో ఆటోమొబైల్ సీటింగ్ బాధ్యతను తీసుకుంటుంది. 
జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక‌్షన్‌:- నాగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి, నిర్వహణకు మెహిన్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి అనుబంధ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆర్డర్లు దక్కించుకుంది.
విశాల్‌ బేరింగ్స్‌:- బోర్డు బోనస్‌ ఇష్యూ ప్రక్రియను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ. 10 చొప్పున మొత్తం 50లక్షల ఈక్విటీ షేర్లును జారీ చేయనుంది. 
సన్‌ టీవీ:- ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటిచింది. రూ.5లు ముఖవిలువ కలిగిన ప్రతిషేరుపై రూ.2.50ల ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జిమ్‌కో ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ సిస్టమ్‌:- స్వతంత్ర డెరెక్టర్‌గా ధవల్‌ మెహాతా నియమానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఆయిల్‌ ఇండియా:- కేజీ ఆఫ్‌షోర్స్‌, త్రిపురాల్లో రెండు ఆయిల్‌ బ్లాక్‌ను దక్కించుకుంది. 
యూకో బ్యాంక్‌:- ఎంప్లాయ్‌ షేర్‌ పర్చేజ్‌ పథకంలో భాగంగా సొంత కంపెనీ ఉద్యోగులకు షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
సోలార్‌ యాక్టివ్‌ ఫార్మా:- ప్రమోటర్‌ గ్రూప్‌నకు 1.05 కోట్ల వారెంట్లను జారీకీ బోర్డు ఆమోదం తెలపనుంది.
డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌:- కంపెనీలో కేంద్రం తన మొత్తం వాటాలో 73.44 శాతం వాటా విక్రయించనుంది.
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- అస్సాంలోని బారోయ్‌ టీ ఎస్టేట్‌ ఆస్తులను జతిన్‌గా అగ్రో టెక్‌కు రూ.28 కోట్లకు విక్రయించనుంది.
అశోక్‌ లేలాండ్‌:- గుజరాత్‌ రాష్ట్ర రవాణాకు 129 బస్సుల తయారీకి ఆమోదం తెలిపింది.
వరుణ్‌ బేవరేజెస్‌:- పంజాబ్‌లో రూ.550 కోట్ల ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు  ప్రకటించింది.You may be interested

ఈ మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌!

Monday 11th March 2019

తాజా ర్యాలీలో భాగంగా మిడ్‌క్యాప్‌ స్టాకులు క్రమంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌పై బ్రోకరేజ్‌ సంస్థలు ప్రత్యేక మక్కువ చూపుతున్నాయి. అలాంటి స్టాకుల వివరాలు... సీఎల్‌ఎస్‌ఏ: 1. సద్భావ్‌ ఇంజనీరింగ్‌: గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 42 శాతం పతనమైంది. ప్రస్తుతం వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ స్టాకును తన మోడల్‌ పోర్టుఫోలియోలో చేరుస్తున్నట్లు తెలిపింది. 2. శోభా: గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు

మార్చి- ఏప్రిల్‌ ర్యాలీకి రెడీ?

Monday 11th March 2019

గత చరిత్రను కొలమానంగా తీసుకుంటే మార్చి, ఏప్రిల్‌ కాలంలో రిస్కురివార్డు నిష్పత్తి ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఈ దఫా కూడా ఇదే ధోరణి వ్యక్తమవుతోంది. పదేళ్లలో ఎనిమిదిమార్లు నిఫ్టీ మార్చి, ఏప్రిల్‌ కాలంలో దాదాపు సరాసరిన 6.1 శాతం ర్యాలీ జరిపింది. క్యు4 ఫలితాల సీజన్‌పై ఆశలు, అంతర్జాతీయంగా ఈ కాలంలో సానుకూల వాతావరణం కారణంగా ఈ రెండు నెలలు దేశీయ సూచీలు సైతం ఎక్కువమార్లు పాజిటివ్‌గానే స్పందించాయి.

Most from this category