STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 6th December 2018
Markets_main1544069036.png-22676

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:
 టాటా మోటర్స్‌:- బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లేలాండ్‌ అమ్మకాలు నవంబర్‌ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఇదే నవంబర్‌లో కంపెనీ మొత్తం 8895 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు 9055 యూనిట్లుగా నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నవంబర్‌లో 2716 జాగ్వర్‌ అమ్మకాలను జరపగా, గతేడాది ఇదే నెలలో ఏకంగా 6241 వాహనాలను విక్రయించింది. లాండ్‌ రోవర్‌ అమ్మకాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గతేడాది నవంబర్‌లో 6241 యూనిట్లను విక్రయాలు జరగ్గా, ఈ నవంబర్‌లో మొత్తం 6339 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.100 కోట్ల విలువైన వాణిజ్య పేపర్ల ఇష్యూను జారీ చేసింది.
క్యాస్టెక్స్‌ టెక్నాలజీస్‌:- రుణాదాతలు లిబర్టీ హౌస్‌ రెవెల్యూషన్‌ ప్రణాళికను ఉపసంహరించుకున్నారు.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- ఈ డిసెంబర్‌ ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీరేట్లను యధాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
నెస్లే ఇండియా:- గతేడాది ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రతి షేరు ధరపై రూ.50ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
లెమన్‌ ట్రీ హోటల్స్‌:- లెమన్‌ ట్రీ ప్రీమియర్‌ పేరుతో పూణేలో 201 గదుల హోటల్‌న ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కంపెనీ 31 నగరాల్లో 52 హోటల్స్‌ను నిర్వహిస్తుంది.
సంధ్న బ్రాడ్‌కాస్ట్‌:- కంపెనీ సీఈవోగా పూజా అగర్వాల్‌, సీఎఫ్‌ఓగా సత్యబర్త ముఖర్జీ నియమితులయ్యారు.
సాగర్‌ సిమెంట్స్‌:- సద్గురు సిమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
స్పైస్‌ మొబిలిటి:- వ్యక్తిగత కారణాలతో కంపెనీ సీఎఫ్‌ఓ పదవికి మధుసూధన్‌ వెంకటాచారీ రాజీనామా చేశారు. రేపు (డిసెంబర్‌ 07) జరిగే బోర్డు సమావేశంలో సభ్యులు నూతన సీఎఫ్‌ఓను ఎన్నుకోనున్నారు.
టైర్ల షేర్లు:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్ల ఎగుమతులు 7శాతం వృద్ధి చెంది రూ.13వేల టర్నోవర్‌కు చేరుకుంటుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ గణాంకాలు వెల్లడించాయి.
ఐనోక్స్‌:- భారతీయ సినిమారంగంలో పీవీఆర్‌ సంస్థ తరువాత దేశంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ముంబై థియేటర్లలో ప్రదర్శించనుంది.
ఇండియన్‌ ఓవర్సీస్‌:- ఈఎస్‌పీఎస్‌ పథకంలో భాగంగా కంపెనీ తమ ఉద్యోగులకు 182 మిలియన్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
మారుతి సుజుకీ:- జనవరి నుంచి తమ మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
లుపిన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ మధ్యప్రదేశ్‌లోని మండిదీప్‌ యూనిట్‌కు 22 అబ్జర్వేషన్లను జారీ చేసినట్లు లుపిన్‌ స్టాక్‌ ఎక్సే‍్చంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
అలెంబిక్‌ ఫార్మా:- అధిక రక్తపోటు ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.You may be interested

గ్యాప్‌డౌన్‌ మార్కెట్‌

Thursday 6th December 2018

10,700 దిగువున నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,782 పాయింట్లతో పోలిస్తే 64 పాయింట్ల నష్టంతో 10,718 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,884 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల నష్టంతో 35,694 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 6th December 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది.  ♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొద్దని ఒపెక్‌ దేశాలను కోరారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు బాగా పెరగొచ్చని తెలిపారు. కాగా ఒపెక్‌ దేశాలు డిసెంబర్‌

Most from this category