STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 11th September 2018
Markets_main1536637698.png-20138

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌:- నేడు 1:1 నిష్పత్తిలో షేర్ల విభజన కానున్నాయి.
రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌:- తొలి త్రైమాసికంలో రూ.40 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో సాధించిన రూ.38 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 41శాతం అధికం. ఆదాయం గత క్యూ1లో రూ.383 కోట్లు నమోదు కాగా, ఈ క్యూ1లో 404 కోట్లను సాధించింది.
సన్‌ ఫార్మా:- ఇజ్రాయెల్‌కు చెందిన టార్సియెస్‌ ఫార్మాలో 18.75శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాకు సమానమైన 3.34 లక్షల ఈక్విటీ షేర్లను రూ.21 కోట్లకు నగదు రూపంలోనే కొనుగోలు చేసింది.
జైపీ ఇన్ఫ్రాటెక్‌:- స్వతంత్ర్య డైరెక్టర్లైన కేశవ్‌ ప్రసాద్‌ రావ్‌, బసంత్‌ కుమార్‌ గోస్వామిలు రాజీనామా చేశారు.
ఎన్‌ఎండీసీ:- ఆగస్ట్‌లో 9.85 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని చేయగా, 11.04 మిలియన్‌ టన్నుల అమ్మకాలను జరిపింది.
ఆరెస్సాలార్‌ మిట్టల్‌:- ఎస్సార్‌ స్టీల్‌ను దక్కించుకునేందుకు రూ.42వేల కోట్లకు బిడ్‌ ధాఖలు చేసింది.
యస్‌ బ్యాంకు:- రుణాల రూపంలో రూ.30వేల కోట్ల సమీకరణకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు.
బలపూర్‌ చిని:- ఫ్రాన్స్‌కు చెందిన మోర్గాన్‌ స్టాన్లీ ప్రతి షేరు ధర రూ.78.32చొప్పున మొత్తం 15వేల ఈక్విటీ షేర్లను విక్రయించింది.
ఎస్సెల్‌ ప్రోప్యాక్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో కంపెనీ రూ.60 కోట్ల విలువైన వాణిజ్య పేపర్ల ఇష్యూను జారీ చేసింది.
ఆర్మెన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- సెప్టెంబర్‌ 13న జరిగే బోర్డు సమావేశంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ఇషూ‍్యను పరిశీలించనుంది.
కిర్లోస్కర్‌ పెన్యూమాటిక్‌:- కంపెనీ స్వతంత్ర్య డైరెక్టర్‌గా నళినీ వెంకటేషన్‌ నియమితులయ్యారు.
టాటా కమ్యూనికేషన్‌:- ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసే జేమ్స్‌ పరేఖర్‌ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఇదే కంపెనీ ఛీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌:- ఐసీఐసీఐ బ్యాంకు దివాళా సృ‍్మతి చట్టం కింద ఎన్‌సీఎల్‌టీకి పిటిషన్‌ ధాఖలు చేసింది.
నేడు క్యూ1 ఫలితాలను వెల్లడించే కంపెనీలు:- రియలన్స్‌ క్యాపిటల్‌, పీఎఫ్‌సీ, ప్రతిభా ఇండస్ట్రీస్‌.You may be interested

లాభనష్టాల మధ్య సయ్యాట

Tuesday 11th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,922 పాయింట్లతో పోలిస్తే 95 పాయింట్ల లాభంతో 38,017 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,438 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి.  అమెరికా మార్కెట్లు సోమవారం

మార్కెట్‌ పడుతుందా? పెరుగుతుందా?

Tuesday 11th September 2018

సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే నష్టాలను కొనసాగించింది. 11,500 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలుకావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచింది.  పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,385,

Most from this category