News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 27th November 2018
Markets_main1543290285.png-22397

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి..!
సన్‌ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌:- జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీ కొనుగోలు చేస్తున్నట్లు సన్‌ఫార్మా సోమవారం ప్రకటించింది. పోలా ఫార్మా జపాన్‌లో చర్మసంబంధిత వ్యాధుల జనరికల్‌ ఔషధాలను తయారు చేస్తుంది. ఈ కొనుగోలుతో పోలా ఫార్మాకు చెందిన రెండు మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు సన్‌ఫార్మా చేతికి దక్కనున్నాయి. ఈ డీల్‌ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.7.7 కోట్లు. పోలా ఫార్మాను చేజిక్కుంచుకోవడంతో ద్వారా ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల విభాగంలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటామని సన్‌ఫార్మా తెలిపింది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ:-  డిబెంచర్‌ హోల్డర్లకు నవంబర్‌ 26న ఎన్‌సీడీల వడ్డీ చెల్లించడంలో విఫలమైంది.    
యస్‌ బ్యాంక్‌:- ప్రమోటర్‌ కంపెనీలు రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు రూ.200కోట్లను, ఫ్రాక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు రూ.200 కోట్లను చెల్లించాయి.
మాట్రిమోనీ డాట్‌ కామ్‌:- సీఎఫ్‌ఓగా బాలసుబ్రమణ్యం తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో సుశాంత్‌ను నియమించింది.
ఓరియంటల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా:- ఈఎస్‌పీఎస్‌ పథకంలో భాగంగా కంపెనీ తన ఉద్యోగులకు 5కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల జారీకి షేరు హోల్డర్లు ఆమోదం తెలిపారు.
హెచ్‌ఈజీ:- సుమారు రూ.750 కోట్ల విలువైన బైబ్యాక్‌ ఆఫర్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా కంపెనీ 13.36లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకుంటుంది. ప్రతిషేరుకు ఇష్యూ ధర రూ.5,500లుగా నిర్ణయించింది.
లుపిన్‌:- అతిశుభ్రత వ్యాధి చికిత్సలో వినియోగించే క్లోమిప్రమైన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
అలెంబిక్‌ ఫార్మా:- భాగస్వామ్య కంపెనీతో కలిసి తయారీ లిడోకైన్‌ అయింట్‌మెంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు పొందింది.
భారతీఎయిర్‌టెల్‌:- ఆఫ్రికా విభాగం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా లిమిటెడ్‌ తర్వలో ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి 8 అంతర్జాతీయ బ్యాంకులను నియమించినట్లు స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- ప్రైవేట్‌ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్ల జారీ ద్వారా కంపెనీ రూ.8వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది.
ఎన్‌ఎండీసీ:- ఈ అక్టోబర్‌ 15.47 మిలియన్‌ టన్నుల ఐరన్‌ఓర్‌ను ఉత్పత్తి చేయగా, 16.55 మిలియన్‌ టన్నులను విక్రయించింది.You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 27th November 2018

ఆసియా మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలతో మంగళవారం మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంలో 35,394 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప నష్టంతో 10,621.45 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. చైనా దిగుమతులపై మరిన్ని పన్నులు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ఈదేశ పాలనావ్యవస్థతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలతో మంగళవారం ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు దేశీయ

ఐటీ స్టాక్స్‌ ఇప్పటికీ అనుకూలమే!

Tuesday 27th November 2018

ఈ ఏడాది ఐటీ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయి. కానీ, గత కొన్ని రోజులుగా మాత్రం ఇవి నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ డాలర్‌తో క్షీణిస్తూ వచ్చిన విషయం విదితమే. ఇది డాలర్ల మారకంలో ఆదాయాలను గడించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చేది. పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని పుంజుకోవడం కూడా ఐటీ కంపెనీలకు వరంగా మారింది. అందుకే ఐటీ స్టాక్స్‌ ర్యాలీ

Most from this category