STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 4th December 2018
Markets_main1543898503.png-22603

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇండియన్‌ సిమెంట్స్‌:- స్ప్రింగ్‌వే మైనింగ్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీ ఇండియన్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారునుంది.
సన్‌ ఫార్మా:- ర్యాన్‌బ్యాక్సీ డీలింగ్‌లో కంపెనీపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ర్యాన్‌బ్యాక్సీ ఒప్పంద వ్యవహారంలో కంపెనీ ఎలాంటి నియమనిబంధల ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరణనిచ్చింది. అలాగే ఇన్‌సైడ్‌ ట్రేడ్‌ కేసును రీ- ఓపెన్‌ చేస్తున్నట్లు సెబీ నుంచి కంపెనీకి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపింది
ఇమాబ్బి ఇండస్ట్రీస్‌:- బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర భాగస్వామ్యంతో కలిసి ఫండింగ్‌ స్కీమ్‌ను ఆవిష్కరించింది.
వోడా ఫోన్‌ ఇండియా:- సంస్థాగత పెట్టుబడిదారులతో సింగపూర్‌లో నేడు(డిసెంబర్‌ 04), హాంకాంగ్‌లో 5,6తేదీల్లో, చెన్నైలో 07తేదిలో సమావేశాన్ని నిర్వహించనుంది.
యస్‌ బ్యాంక్‌:- ఐఆర్‌డీఏఐ మాజీ ఛీఫ్‌ టీ.ఎస్‌ విజయన్‌ను విజయన్‌ను కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌గా నియమించింది. ఈయన కంపెనీకి ఐదేళ్ల పాటు సేవలు అందించనున్నారు.
యాక్సిస్‌ బ్యాంక్‌:- భారీగా బినామి ఆస్తులను కూడగట్టుకన్నారని బ్యాంక్‌ ఉద్యోగిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిన వార్తలను ఖండించింది. అయితే, మీడియాలో ప్రసారమవుతున్న వార్తల నేపథ్యంలో సదరు ఉద్యోగిపై అంతర్గత విచారణ చేపినట్టినట్లు బ్యాంక్‌ వివరణనిచ్చింది.
ఎన్‌సీసీ:- వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ నవంబర్‌లో రూ.220.20 కోట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఆర్డర్లలో ఎలక్ట్రికల్‌ విభాగానికి రూ.174.2 కోట్లు కాగా, మరో రూ.46 కోట్లు నీటి విభాగానికి సంబంధించినవి కంపెనీ తెలిపింది.
ఇన్ఫీభీమ్‌ అవెన్యూ:- ముంబై ఆధారిత ఆన్‌లైన్‌ పేమెంట్‌ కంపెనీ గ్లోబల్‌ పేటెక్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.



You may be interested

బ్రోకరేజ్‌లు ‘బై రేటింగ్‌’ ఇచ్చిన 6 షేర్లు..

Tuesday 4th December 2018

ముంబై: స్వల్పకాలానికి 7 నుంచి 33 శాతం రాబడిని అందించగలిగిన 6 షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేస్తున్నాయి. అవేంటంటే.. ఎస్కార్ట్స్‌ బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్‌ రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.695-700 | టార్గెట్ ధర: రూ.750-760 | రాబడి అంచనా: 7 శాతం ఫెడరల్ బ్యాంక్ బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్ రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.83.50-84.50 | టార్గెట్ ధర:

5 పైసలు బలహీనపడిన రూపాయి

Tuesday 4th December 2018

డాలరుతో 70.51 వద్ద ప్రారంభం సోమవారం ముగింపు 70.46 ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో స్వల్ప నష్టాలను నమోదుచేసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 70.51 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 15 నిమిషాల సమయానికి రికవరీ సాధించి 0.02 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. ఈ సమయానికి 70.44 వద్ద ఉంది. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ మూడు

Most from this category