News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 14th May 2019
Markets_main1557807018.png-25718

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
పీఎస్‌బీ ఇన్ఫ్రాటెక్‌:-
తన అనుబంధ సంస్థ పీఎస్‌సీ హైవేస్‌కు కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను పెంచింది. కంపెనీ గల బ్యాంకు రుణ సౌకర్యాలను దృష్టి ఉంచుకుని రేటింగ్‌ను ‘‘ఎ(-)’’ నుంచి ‘‘ఎ’’ కు రేటింగ్‌ను పెంచుతున్నట్లు రేటింగ్‌ సం‍స్థ తెలిపింది. 
అవధ్‌ షుగర్స్‌:-  1:1 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూను ప్రకటించింది.
శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌:-  ప్రతి ఈక్విటీ షేరుకు రూ.5ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ ఎ3+ నుంచి ఎ4+ తగ్గించింది. కంపెనీకి ఉండాల్సిన లిక్విటిడీ కన్నా తక్కువగా ఉండటం ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది.
ఆర్తి ఇండస్ట్రీస్‌:- మే 21వ కంపెనీ ప్రకటించిన క్యూ4 ఫలితాల సందర్భంగా బోనస్‌ షేర్ల ఇష్యూను జారీ చేయవచ్చు.
యూనిటెడ్‌ బ్యాంక్‌:- ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఓరియంటల్‌ బ్యాంక్‌:- ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.3000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో కంపెనీ మాజీ సీఈవో చందాకొచర్‌, ఆమె భర్త దీప్‌ కొచర్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. 
అలహాబాద్‌ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రుణ రేటును స్వల్పంగా తగ్గించింది. అన్ని కాల పరిమితుల రుణ రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. 
అటో రంగ షేర్లు:- ఏప్రిల్‌లో ప్యాసింజర్‌ అమ్మకాలు ఎనిదేళ్ల కనిష్టానికి పతనమైనట్లు భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో నేడు వాహన కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. 
నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- సిమెన్స్‌, నెస్లే, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వెల్‌స్పన్‌ కార్పో, జీ మీడియా కార్పోరేషన్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎండ్యూర్‌సన్‌ టెక్నాలజీస్‌, ఫైమ్‌ ఇండస్టీ‍్రస్‌, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్‌, లుమెక్స్‌ ఇండస్టీ‍్రస్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, పాలీక్యాబ్‌ ఇండియా, పీటీసీ ఇండియా, సిక్వెంట్‌ సైటింఫిక్‌, సెష్పాలిటీ రెస్పారెంట్స్‌ వెస్ట్‌లైఫ్‌ డెవెలప్‌మెంట్స్‌ .



You may be interested

నెల గరిష్టానికి పసిడి

Tuesday 14th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర నెలరోజుల గరిష్టానికి చేరుకుంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదరడం, పశ్చిమ ఆసియా సముద్రజలాల్లో ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రికత్త వాతవరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. ఇందుకు కారణమైంది. ఆసియాలో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 1,301.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా రూ.14

మరో నష్టాల ప్రారంభం

Tuesday 14th May 2019

వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం క్షీణతతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల తగ్గుదలతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల క్షీణతతో 11,222 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఇంట్రాడేలో 20 శాతం వరకూ పడిపోయిన సన్‌ఫార్మా తాజాగా 2 శాతం పెరిగింది. వేదాంత, అదాని పోర్ట్స్‌, టీసీఎస్‌, ఐటీసీలు స్వల్పలాభంతో మొదలయ్యాయి. మరోవైపు జీ

Most from this category