STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th November 2018
Markets_main1541478657.png-21733

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
విప్రో:- వ్యాపార కార్యకలాపాల కోసం చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌తో జట్టు కట్టనుంది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- డచ్‌ బ్యాంక్‌కు సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదర్చుకుంది.
హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్చన్స్‌:- రూ.500 కోట్ల విలువైన రైట్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. నవంబర్‌ 12న రైట్స్‌ ఇష్యూ కమిటి సమావేశం జరగనుంది.
ఆంధ్రా బ్యాంక్‌:- ఏఎస్‌ఆర్‌ఈసీ, ఇండియా ఇంటెల్‌ బ్యాంక్‌, ఇండియాఫస్ట్‌లైఫ్‌ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటా ఉపసంహరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
కరూర్‌ వైశ్యాబ్యాంక్‌:- నవంబర్‌ 07 నుంచి పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు అమల్లోకి రానున్నాయి.
మిండా ఇండస్ట్రీస్‌:- కొత్తగా ఏర్పాటైన యూనిట్‌లో రూ.76.52కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు నవంబర్‌ 07 నుంచి అమల్లోకి రానున్నాయి.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.100 కోట్ల కమర్షియల్‌ పేపర్ల జారీ ఇష్యూ నిన్న (నవంబర్‌ 05న) ప్రారంభమైంది.
ఇండియన్‌ బ్యాంక్‌:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు నవంబర్‌ 09 నుంచి అమల్లోకి రానున్నాయి.
సిమన్స్‌-ఆల్‌స్టమ్‌:- ఇరు కంపెనీల విలీన ఒప్పందానికి సీసీఐ(కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆమోదం తెలిపింది.
డీహెచ్‌ఎల్‌ఎఫ్‌:- కమర్షియల్‌ పేపర్‌పై గల రూ.1,775 కోట్ల రుణాన్ని తీర్చింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ రెండో విడత చర్చలు ప్రారంభించిందనే వార్తలను ఖండించింది.
నాట్కో ఫార్మా:- రూ.1000 కోట్ల విలువైన బైబ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో కంపెనీ ప్రతిషేరు ధర రూ.1,000 చొప్పున మొత్తం 8.22శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనుంది.
అదానీ పోర్ట్స్‌:- రానున్న ఐదేళ్లలో కంపెనీ రూ.8వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.     
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, కుపిడ్‌, గ్రాఫైట్‌ ఇండియా, డాక్టర్‌ లాల్‌ ఫాథ్‌లాబ్స్‌, వోల్టాస్‌, మణిప్పురం ఫైనాన్స్‌, సంఘీ ఇండస్ట్రీస్‌.You may be interested

ఈ నెలాఖర్లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ఈ నెలాఖరులో ఉండొచ్చని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 10 షేర్లతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్రం నిధులు సమీకరించడం ఇది నాలుగోసారి. మూడు సార్లు సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్లు సమీకరించింది. కాగా ఈ ఈటీఎఫ్‌ను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యస్థీకరిస్తోంది.

బలపడిన రూపాయి

Tuesday 6th November 2018

17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభం ఇండియన్‌ రూపాయి మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ ఆరంభించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభమైంది. బ్యాంకులు, ఎగుమతిదారులు.. అమెరికా డాలర్లను విక్రయించడం ఇందుకు కారణం. కాగా రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించి 73.12 వద్ద క్లోజయ్యింది. రెండు సెషన్లలో బలపడుతూ వచ్చిన ఇండియన్‌ రూపాయి సోమవారం రోజు తీవ్ర ఒత్తిడికి గరయ్యింది.

Most from this category