STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th April 2019
Markets_main1554871727.png-25040

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఎస్‌బీఐ:- ఆర్‌బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో ఎంసీఎల్‌ఆర్‌ 5 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. అలాగే రూ.30లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీరేటు 10 బేసిస్‌పాయింట్లను తగ్గించింది. 
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌:- అమెరికా దేశానికి చెందిన గూవ్‌ ఇంక్‌ కంపెనీతో నిర్మాణాత్మక లైసెన్స్‌ ఒప్పందం(సీఎల్‌ఏ)పై సంతకం చేసినట్లు ప్రకటించింది. ఇందులో కంపెనీ ప్రజ్‌ ఇండస్టీ‍్రస్‌ పళ్లరసాల్లో మెలాసిస్‌ శాతాన్ని లెక్కించే సాంకేతిక పరిఙా‍్క్షనాన్ని అందించనుంది. 
టాటా స్పాంజ్‌ ఐరన్‌:- ఉషామార్టిన్‌ కంపెనీకి చెందిన ఉక్కు వ్యాపారం, క్యాపిటివ్‌ పవర్‌ ప్లాంట్ల  కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. ఈ కొనుగోలు ఒప్పంద విలువ రూ.4,525 కోట్లు. ఇరు కంపెనీలు గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ కొనుగోలుకు అంగీకరించాయి. అలాగే ఏప్రిల్‌ 18వ  బోర్డు సమావేశం నిర్వహించండంతో పాటు, గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇన్ఫో ఎడ్జ్‌:- తన అనుబంధ సంస్థ బిజ్‌క్రూమ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- కమర్షియల్‌ పేపర్ల జారీ ద్వారా కంపెనీ రూ.50 కోట్ల సమీకరణను పూర్తి చేసింది. 
అశోక్‌ లేలాండ్‌:- కంపెనీ ప్రమోటర్‌ ఒకరు 1.33శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను తనఖా పెట్టారు. 
వోడాఫోన్‌ ఐడియా:- రైట్స్‌ ఇష్యూ నేటి(ఏప్రిల్‌ 10) నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగి ఒక్కో ఈక్విటీ షేరును రూ.12.50లు ధరకు మొత్తం 2000 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.25000 కోట్లను సమీకరించనుంది. ఈ రైట్స్‌ ఇషూ‍్య ఏప్రిల్‌ 24న ముగుస్తుంది. 
పనాసియా బయోటెక్‌:- కంపెనీ చెందిన రుణాన్ని తీర్చేందుకు కన్షారియం రుణదాతలతో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
మైండ్‌ ట్రీ:- ఏప్రిల్‌ 17న కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదలు చేయనుంది. ఈ రోజే కంపెనీ ఇన్వెస్టర్లకు ఇంటర్మ్‌ డివిడెండ్‌ను లేదా స్పెషల్‌ డివిండెడ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.You may be interested

28 నెలల కనిష్టస్థాయికి నిఫ్టీ ఫ్యూచర్‌ ఓపెన్‌ ఇంట్రస్ట్‌

Wednesday 10th April 2019

ఎన్నికల సందర్భంగా మార్కెట్లో సందిగ్ధత కొనసాగుతోది. దీంతో ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ మంగళవారం క్లోజింగ్‌ సమయానికి 1.6 కోట్లకు చేరింది. ఇది గత 28 నెలల కనిష్ఠస్థాయి. మార్కెట్‌ గమనంపై ట్రేడర్లకు స్పష్టమైన అంచనాలు లేకపోవడంతో చాలామంది పొజిషన్లు తగ్గించుకుంటున్నారు. గతనెల భారీ పరుగుల తర్వాత ప్రస్తుతం సూచీలు పరిమిత రేంజ్‌లో కదలాడుతున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాలపై అస్పష్టతే

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 10th April 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బుధవారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల క్షీణతతో 38,874 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11645 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి పట్ల తిరిగి సందేహాలు తలెత్తడంతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం వరకూ పడిపోయాయి. ఇదే కారణంతో తాజాగా ఆసియా సూచీలన్నీ అంతేశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. విప్రో, టాటా మోటార్స్‌,

Most from this category