STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 21st September 2018
Markets_main1537505072.png-20433

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
యస్‌ బ్యాంక్‌:- యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపధ్యంలో తదుపరి చర్యలపై చర్చించేందుకు బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఈ సెప్టెంబర్‌ 25న సమావేశం కానున్నారు.
విప్రో టెక్‌:- యూరప్‌లో తన అనుబంధ సంస్థ విప్రో టెక్‌ ఆస్ట్రియాను విలీనం చేసుకునేందకు షేర్‌హోల్డర్లు అనుమతినిచ్చారు.
టాటా మోటర్స్‌:- ఫిచ్‌ రేటింగ్‌ సం‍స్థ టాటా మోటర్స్‌ కంపెనీ రేటింగ్‌ను ‘‘నెగిటివ్‌’’ నుంచి ‘‘బిబి+’’కు పెంచింది.
స్టెరిలైట్‌ టెక్‌:- ఎయిర్‌సెల్‌ ఆస్తులను సొంతం చేసుకునేందుకు బిడ్‌ ధాఖలు చేసిందనే వార్తలను ఖండించింది. తాము ఎలాంటి బిడ్లను దాఖలు చేయలేదని స్పష్టం చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో ఆఫ్‌షోర్‌ నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 24న  కమిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నటు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- అస్దా లిమిటెడ్‌కు ఐటీ పరిఙ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
స్ట్రైడ్స్ ఫార్మా సైన్సెస్‌:- తన అనుబంధ సంస్థ యారో ఫార్మాస్యూటికల్స్‌ను అపోటెక్స్‌ ఆస్ట్రేలియాలో విలీనం చేసేందుకు ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్‌(ఏసీసీసీ) అనుమతులను ఇచ్చింది.
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ప్రభుత్వానికి ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా రూ.2,354 కోట్ల నిధులను సమీకరించింది.
అలహాదాబాద్‌ బ్యాంక్‌:- ఈ ఏడాదిలో పలు విడతల్లో క్యూఐపీ పద్దతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.1,500 కోట్ల సమీకరణకు ప్రణాళిలు సిద్ధం చేసింది. ఇందుకు బోర్డు డైరెక్టర్ల అనుమతులు కూడా పొందింది.
ఎన్‌బీసీసీ:- ఈ ఆగస్ట్‌లో కంపెనీ మొత్తం రూ.921.67 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
గ్రావిటా:- చిత్తూర్‌లోని శ్రీసిటి ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపింది.
దిలీప్‌ బిల్డ్‌కాన్‌:- మధ్యప్రదేశ్‌లో మెట్రో రైల్‌ పనుల్లో రూ.228.96 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
ఐటీసీ:- పార్క్‌ హయాత్‌ గోవా రిసోర్ట్‌ అండ్‌ స్పాను కొనుగోలు చేసింది.
అపోలో టైర్స్‌:- హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలో 5.05శాతం వాటాను కొనుగోలు చేసింది.
ఆదిత్యా బిర్లా కంపెనీ:- రూ.800 కోట్ల విలువైన నాన్‌-కన్వర్టబుల్‌ డింబెచర్ల ఇష్యూకు రేటింగ్‌ సంస్థ ఇక్రా ఎఎఎ(స్థిరత్వం)రేటింగ్‌ను కేటాయించింది.
జేఎంసీ ప్రాజెక్ట్స్‌:- రూ.10ల ముఖవిలువ కలిగిన ప్రతి షేరును 1:2 నిష్పత్తిలో విభజన చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎస్సార్‌ స్టీల్‌:- ఆర్సలర్‌ మిట్టల్‌తో విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది.You may be interested

వారంరోజుల గరిష్టానికి పసిడి ధర

Friday 21st September 2018

ముంబై:- డాలర్‌ బలహీనతతో పాటు, అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రరూపం దాల్చడంతో పసిడి ధర శుక్రవారం వారంరోజుల గరిష్టానికి ఎగసింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు  2.50 డాలర్లు లాభపడి 1,213.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 10-వారాల కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. వచ్చేవారంలో ఫెడ్‌

ఆర్సెలర్‌ మిట్టల్‌ చేతికి ఎస్సార్‌ స్టీల్‌ !

Friday 21st September 2018

న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్‌ స్టీల్‌ టోకోవర్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.  ఆర్సెలర్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్పొరేషన్‌ల కన్సార్షియమ్‌ ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీని  టోకోవర్‌ చేయనున్నది. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు

Most from this category