STOCKS

News


గురువారం ప్రభావితమయ్యే షేర్లు

Thursday 27th September 2018
Markets_main1538022238.png-20613

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
కన్జ్యూమర్‌ గూడ్స్‌ షేర్లు:- పెరిగిపోతున్న కరెంట్‌ ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతను అడ్డుకునే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 19రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. బుధవారం అర్థరాత్రి నుంచి రేట్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు కన్జ్యూమర్‌ గూడ్స్‌ షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హీరోమోటర్‌ కార్ప్‌:- పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి విలువ క్షీణత ప్రభావాలను ఎదుర్కోనేందుకు తమ వాహన రేట్లను రూ.900 దాకా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు అక్టోబర్‌ 3నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
హెచ్‌సీఎల్‌ టెక్‌:- మైనింగ్‌ కంపెనీ ఆంగ్లో అమెరికన్‌కు 5ఏళ్ల పాటు ​మౌలిక సదుపాయాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
విజయా బ్యాంక్‌:- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ల విలీన అంశం చర్చించేందుకు బ్యాంకు బోర్డు ఈ సెప్టెంబర్‌ 29న బోర్డు సమావేశం నిర్వహించనుంది
టీసీఎస్‌:- రూ.16వేల కోట్ల బైబ్యాక్‌ ఇష్యూను పూర్తి చేసింది.
పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌:- రూ.65వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదారులు అనుమతిని తెలిపారు.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4శాతం వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ డీల్‌ విలువ రూ.481.కోట్లు. ఎస్‌బీఐ విక్రయించనున్న 4శాతం వాటాను యాక్సిస్‌ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థలు కొనుగోలు చేయనున్నాయి.
ఐషర్‌ మోటర్స్‌:- మార్కెట్‌లోకి  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి 2 సరికొత్త బైక్‌లను విడుదల చేసింది.
ఎఫ్‌ఎస్‌సీ:- రూ.199 కోట్ల ఎన్‌సీడీల ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- సిబ్బందికి వేతానాలు చెల్లించడంతో మరోసారి విఫలమైంది. ఆగస్ట్‌ నెలలో సిబ్బంది మొత్తం వేతనాల్లో 75శాతం మాత్రమే చెల్లించింది. మిగిలిన మరో 25శాతం జీతాన్ని చెల్లించేందుకు 10రోజుల గడువు కోరింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- పీఎన్‌బీ పారిబా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన 51లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు రూ.297.87చొప్పున కొనుగోలు చేసింది.
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:- హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి ముంబైలో 4ఎకరాల విస్తీర్ణంలో గల కమర్షియల్‌ భూమిని కొనుగోలు చేసింది.
చక్కెర షేర్లు:- చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నేటి ట్రేడింగ్‌లో చక్కెర షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



You may be interested

ఫెడ్ రేటు పావు శాతం పెంపు..

Thursday 27th September 2018

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్‌ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది

రూపీ అప్‌

Thursday 27th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం బలపడింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు దిగుమతి ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన బుధవారం ముగింపు 72.62తో పోలిస్తే 0.30 శాతంమేర లాభపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 72.41 వద్ద ప్రారంభమైంది.  కేంద్ర ప్రభుత్వం బుధవారం

Most from this category