STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th August 2018
Markets_main1533875032.png-19110

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
జీఎంఆర్‌ ఇన్ఫ్రా:- రూ.2950 కోట్ల నిధుల సమీకరణ ఆమోదం తెలపింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటను వాయిదా వేసింది.
ఐడీబీఐ బ్యాంకు:- కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 12.50లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది.
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4శాతం వాటా ఉపసంహరించుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అనుమతులు పొందింది.
వేదాంత, ఓఎన్‌జీసీ:- ఇరుకంపెనీలు 41 బ్లాక్‌లను దక్కించుకున్నట్లు కేంద్ర ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.
అదానీ గ్రీన్‌:- అదానీ రెన్యూబల్‌ ఎనర్జీ సంస్థలో 100శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు స్టాక్స్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
మణిప్పురం ఫైనాన్స్‌:- ఈఆర్థిక సంవత్సరంలో పలు విడుతల వారీగా ఎన్‌సీడీల జారీ చేసి రూ.3వేల కోట్ల నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
దీపక్‌ ఫైర్టిలైజర్స్‌:- మూలధన విస్తరణకు రూ.800 కోట్ల నిధుల సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
భూషణ్‌ స్టీల్‌:- సంస్థ మాజీ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఓ అరెస్ట్‌ చేసింది.
తేజాస్‌ నెట్‌వర్క్స్‌:- రేటింగ్‌ సంస్థ ఇక్రా సంస్థ రేటింగ్‌ను ‘‘ఎ’’ నుంచి ‘‘ఎ1’’కు సవరించింది.

నేడు క్యూ1 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలు:-
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందాల్కో, గెయిల్‌, భాష్‌, డీఎల్‌ఎఫ్‌, సన్‌ టీవీ నెట్‌వర్క్స్‌, యూనిటైడ్‌ బేవరీజెస్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఇంద్రప్రస్థ గ్యాస్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, అపోలో హాస్పిటల్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఎన్‌సీసీ, ఆల్కేమ్‌ ల్యాబ్స్‌,  ఆంధ్రా బ్యాంకు, సీజీ పవర్‌, పీసీ జ్యూవెలరీస్‌, వోల్టాస్‌, ఇండయన్‌ హోటల్స్‌, శీలా ఫామ్‌, వక్రంగీ, లక్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, రూప కంపెనీ, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌, గుజరాత్‌ మినరల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పోరేషన్‌, యూకో బ్యాంకు, కిర్లోస్కర్‌ ఆయిల్‌, పురవంక, జేబీ కెమికల్స్‌, శ్రీరాం ఈపీసీ, ప్రభాత్‌ డైరీ, బాలాజీ టెలీఫిల్మ్స్‌, జీపీటీఎల్‌ హాత్‌వే, టిటాగర్‌, ముక్తా ఆర్ట్స్‌, సియాజీ ఇండస్ట్రీస్‌.



You may be interested

రూపాయి డౌన్‌...

Friday 10th August 2018

68.83 వద్ద ప్రారంభం గురువారం ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం తగ్గుదల ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడింది. అమెరికా, ఇతర దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం క్షీణించింది. ఇక

లాభాలు.. అంతలోనే నష్టాలు..

Friday 10th August 2018

స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే వెంటనే నష్టాలోకి జారిపోయింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,024 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,471 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 11,475 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డ్‌ స్థాయిలను తాకిన విషయం తెలిసిందే. అమెరికా మార్కెట్లు గురువారం స్వల్పంగా తగ్గడం, 

Most from this category