STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 29th August 2018
Markets_main1535515538.png-19734

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
ఇంటెక్‌ క్యాపిటెక్‌:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంజీవ్‌ గోయెల్‌ తిరిగి నియమితులయ్యారు.
ఆర్‌ఎంజీ అల్లో స్టీల్‌:- బోర్డు ఆఫ్‌ ఛైర్మన్‌గా బి.కె. గోయెంకా నియమితులయ్యారు.
సైబర్‌స్కేప్‌ మల్టీమీడియా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎస్‌కే ఆనంద్‌ నియమితులయ్యారు.
అస్ట్రాన్‌ ఇంజనీరింగ్‌ ఎలక్ట్రానిక్స్‌:-  థైసెన్‌క్రుప్‌ ఇండియా విభాగం నుంచి రూ.15 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
జై ప్రకాష్‌ పవర్‌:- కంపెనీ రుణదాతలకు కంపల్సెరీ కన్వర్టబుల్‌ ఫ్రిఫరెన్స్‌ షేర్ల ద్వారా రూ.4వేల కోట్లు చెల్లించాలని యోచిస్తోంది.
జేఎంసీ ప్రాజెక్ట్స్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో రూ.150కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఉజ్జాస్‌ ఎనర్జీ:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ ఈ కంపెనీ రేటింగ్‌ను బిబిబి(+)నుంచి బిబిబి(-)కు తగ్గించింది.
టాటాస్టీల్‌:-  రూ .1500 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో 11.08 శాతం పీహెచ్‌ఎస్‌ను జారీ చేసింది.
జుబిలెంట్‌ ఫుడ్స్‌:- వాణిజ్య పేపర్ల జారీ ఇష్యూకు రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ ఎ1(+)రేటింగ్‌ను కేటాయించింది.
క్వాలిటీ:- మూలధన అవసరాలకు నిధుల సమీకరణ అంశంపై సెప్టెంబర్‌1 జరగనున్న బోర్డు సమావేశంలో చర్చించనుంది.
భారత్‌ ఫైనాన్స్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.512.81 కోట్ల మొదటి డైరెక్ట్‌ అసైన్‌మెంట్‌ లావాదేవీని పూర్తి చేసింది.
పేజ్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా షమీర్‌ గోనోమల్‌ నియామకానికి షేర్‌ హోల్డర్ల అనుమతి కోరింది.
క్రిడెట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌:- రూ.91.22 కోట్ల సెక్యూరిటైజేషన్ లావాదేవీ ప్రక్రియను పూర్తిచేసింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 బోయింగ్‌ 737మాక్స్‌ విమానాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్:- నిఫ్టీ-50 సూచీలో లుపిన్‌ స్థానాన్ని దక్కించుకుంది.
మిల్లీటోన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- 10:1 నిష్పత్తిలో ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
పురవంక:- రూ.1500ల కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
వేదాంత:- 41 ఆయిల్ బ్లాక్‌లను దక్కించుకుంది.
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌:- ప్రభుత్వానికి రూ.122 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది.You may be interested

లాభనష్టాల మధ్య దోబూచులాట

Wednesday 29th August 2018

కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతున్న ఇండెక్స్‌లు బుధవారం నెమ్మదించాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,897 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,738 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 11,745 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్ది సేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:36 సమయంలో నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో

మార్కెట్‌ ఎటు?

Wednesday 29th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆగస్ట్‌ 28న కొత్త గరిష్ట స్థాయిలకు చేరింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు ఇందుకు కారణం. నిప్టీ-50 కొత్త గరిష్ట స్థాయి 11,760ని తాకింది. అయితే ప్రాఫిట్‌ బుకింగ్‌ వల్ల తిరిగి ప్రారంభ స్థాయి సమీపంలోకే వచ్చింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో డోజి రకపు క్యాండిల్‌ను ఏర్పరచింది.  నిఫ్టీ-50 మంగళవారం 11,750 మార్క్‌ను అధిగమించింది. 11,760 పాయింట్ల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,700 సమీపంలోకి

Most from this category