STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 18th April 2019
Markets_main1555561513.png-25197

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అశోకా బిల్డ్‌కాన్‌:-
రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటడ్‌ నుంచి రూ.443.23 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీకి చెందిన రీఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో 25శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ ఆరామ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు రాయట్స్‌ కథనాన్ని వెల్లడించింది. 
రిలయన్స్‌ రీటైల్‌:- బ్రిటన్‌కు చెందిన బొమ్మల తయారీ సంస్థ హామ్‌లేస్‌కు వాటా కొనుగోలుకు చర్చలు ప్రారంభించింది.
ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌ ఆర్‌ఈఐటీ:- ప్రైవేట్‌ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఏప్రిల్‌ 23నుంచి కంపెనీ ఎన్‌సీడీల జారీలను జారీ చేయనుంది. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమాన సేవలను తాత్కలికంగా నిలిపివేసింది. 
సిప్లా:- దక్షిణాఫ్రికాకు చెందిన బ్రాండ్మెడ్‌లో 30శాతం వాటాను 65 మిలియన్ల రాండ్ల( రూ. 32 కోట్లు)కు కొనుగోలు చేసింది. 
బంధన్‌ బ్యాంక్‌:- గృహ్‌ఫైనాన్‌ను బంధన్‌బ్యాంక్‌లో విలీనం చేసేందుకు సీసీఐ ఆమోదం తెలిపింది.
ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌:- తన అనుబంధ సంస్థ కిన్‌డెక్స్‌ హెల్త్‌కేర్‌లో వాటాల కన్సాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. 
సాస్కేన్ టెక్నాలజీస్:- షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభించింది. 
జేఎమ్‌ ఫైనాన్స్‌ ప్రాడెక్ట్స్‌:- ఎన్‌సీడీ ఇష్యూ ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. 
స్టార్‌ సిమెంట్‌:- కేంద్ర ప్రభుత్వం నుంచి రవాణా సబ్సీడీకి సంబంధించి రూ.174.48 కోట్లను దక్కించుకుంది.
లుపిన్‌:- ఫ్లోక్సోటిన్‌ ఔషధాలను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు అనుమతులు దక్కించుకుంది. వీటిని మానసిక ఒత్తిడి నివారణ చికిత్సలో వినియోగిస్తారు. 
నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేసే కొన్ని ప్రధాన కంపెనీలు:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డీసీబీ బ్యాంక్‌, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, టాటా స్పాంజ్‌ ఐరన్‌, జై భారత్‌ మారుతి, ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌, మెజెస్టిక్‌ అటో,  ఆంధ్రప్రదేశ్‌ టన్నెర్స్‌, బీ2బీ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌



You may be interested

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌

Thursday 18th April 2019

అత్యవసర నిధులిచ్చేందుకు బ్యాంకులు నో దీంతో తాత్కాలికంగా విమాన సేవల నిలిపివేత- 20 వేల ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం- బ్యాంకులు, ప్రయాణికులకు వేల కోట్ల బకాయిలు న్యూఢిల్లీ: ఏవియేషన్‌ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ.

11,850 పాయింట్లపైన నిఫ్టీ ప్రారంభం

Thursday 18th April 2019

గత మంగళవారం కొత్త రికార్డును సృష్టించిన స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్లు జంప్‌చేసి 11,850 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో 39,420 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. సూచీలూ రెండూ కొత్త చరిత్రాత్మక గరిష్టస్థాయిని ప్రారంభంలోనే తాకడం విశేషం. పెట్రోకెమికల్స్‌, రిఫైనింగ్‌ వ్యాపారంలో వాటా విక్రయింనున్నదనే వార్తలతో రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 2.5 శాతం జంప్‌చేసి రూ.1,375

Most from this category