STOCKS

News


శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 8th March 2019
Markets_main1552021946.png-24481

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:-
ఈఎస్‌పీఎస్‌ పథకంలో భాగంగా తన సొంత ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.660.80 కోట్లను సమీకరించింది. 
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్‌ఆథారిటీఆప్‌ఇండియా నుంచి రూ.650 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. 
జెట్‌ ఎయిర్‌వేస్:- నిధుల కొరత కారణంగా మరో మూడు విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఎ అధికారి తెలిపారు. 
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌:- తమిళనాడులో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు నుంచి రూ.100 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. 
అఫెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌:- రూ.115 కోట్ల విలువైన బ్యాంకు రుణంపై క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. 
ఇండో యూఎస్‌ బయో-టెక్‌:- బోనస్‌ షేర్ల ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎల్‌ టీ ఫుడ్స్‌:- ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ హౌసింగ్‌ సంస్థ ఎల్‌ టీ ఫుడ్స్‌ కంపెనీలో  తన మొత్తం 2.50శాతం వాటా నుంచి 1.50శాతం వాటాను విక్రయించింది.
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- రేటింగ్‌ సంస్థ కేర్‌ కంపెనీ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీపై స్వల్పకాలికానికి రేటింగ్‌ను పెంచింది. 
లుపిన్‌:- రక్తంలో కొవ్వు శాతం తక్కువైనప్పడు వినియోగించే అటోవాస్టాటిన్ కాల్షియం ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకంది. 
జెన్సార్‌ టెక్నాలజీస్‌:- అమెరికాలోని వైయూర్ మెడికల్ సం‍స్థకు ఐటీ సేవలకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 
విప్రో:- ప్రమోటర్‌ సం‍స్థ అజీమ్‌ ప్రేమ్‌జీ ట్రస్ట్‌  బ్లాక్‌ డీల్‌ పద్దతిలో కంపెనీ చెందిన 2.67 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు తెలిపింది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ముంబయి సెజ్ (ఎన్ఎమ్ఎస్ఇఎస్ఎస్) నుండి 4 వేల ఎకరాల భూమిని లీజ్‌కు తీసుకున్నట్లు తెలిపింది. 
ఇన్ఫోసిస్‌:- రోల్స్‌ - రాయస్‌ గ్రూప్‌నకు ఇంజనీరింగ్‌, డిజిటల్‌ సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 



You may be interested

జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!

Friday 8th March 2019

- భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా - రూ.31,600 కోట్ల విద్యుత్‌ పెట్టుబడులకు ఆమోదం - ఎన్‌హెచ్‌పీసీ చేతికి ల్యాంకో తీస్తా ప్రాజెక్టు - ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన

11050 దిగువన నిఫ్టీ ప్రారంభం

Friday 8th March 2019

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 36680 వద్ద, నిప్టీ 22 పాయింట్లను కోల్పోయి 11035 వద్ద ప్రారంభమైంది. ఆంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రపంచమార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌ నెలకొంది. నెమ్మదించిన ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడంతో పాటు తక్కువ వడ్డీలకు

Most from this category