STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th September 2018
Markets_main1537159046.png-20307

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జీనియన్‌ కలర్స్‌లో అదనంగా 3.10శాతం వాటాను రూ.8.39 కోట్లకు కొనుగోలు చేసింది. ఈవాటా కొనుగోలుతో జీనియన్‌ కలర్స్‌లో రిలయన్స్‌ మొత్తం వాటా 19.63శాతం వాటాను చేరుకుంది.
ఇన్ఫోసిస్‌:- ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది.
సెంచరీ టెక్స్‌టైల్స్‌&ఇండస్ట్రీస్‌:- కంపెనీ డెరెక్టర్‌గా ఆర్‌కే దాల్మియా, సీఎఫ్‌ఓగా స్నేహాల్‌ షాష్‌ నియమితులయ్యారు.
సద్భవన్‌ నైట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌:- షేరు విభజన అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 24న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.1000 కోట్ల  నిధుల సమీకరణకు యోచిస్తోంది.
తాంతియా కన్‌స్ట్రక్షన్స్‌:- బోర్డు డెరెక్టర్‌ పదవికి ఎం ఎల్‌ ఆగర్వాల్‌ రాజీనామా చేశారు.
క్వాలిటీ లిమిటెడ్‌:- నేటి నుంచి (సెప్టెంబర్‌ 17న) క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.80కోట్ల నిధుల సమీకరణకు యోచిస్తోంది.
ఉదయ్‌ జూవెలరీ ఇండస్ట్రీస్‌:- విదేశాలకు ప్రత్యేక ఆభరణాల ఎగుమతులను ప్రారంభించింది.
హిందాల్కో:- రూ.6వేల కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ ఇష్యూకు షేర్‌ హోల్డర్ల అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
వోల్టాస్‌:- ఫ్యూచర్‌ చైన్‌ సప్లైయ్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
యస్‌ బ్యాంక్‌:- రూ.3,042 కోట్ల నిధుల సమీకరణకు మూలధన నిధుల సమీకరణ కమిటీ ఆమోదం తెలిపింది.
కిర్లోస్కర్‌ న్యూమెటిక్‌:- స్టాక్‌ విభజనకు ఈనెల 27ను రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది.
కార్పోరేషన్‌ బ్యాంక్‌:- ఏడాది కాలానికి గానూ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 8.1శాతం నుంచి 8.95శాతానికి పెంచింది. సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు సెప్టెంబర్‌ 15నుంచి అమల్లోకి రానున్నాయి.



You may be interested

ఇది లాభాల స్వీకరణ సమయం: క్రెడిట్‌ సూసీ

Monday 17th September 2018

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లు ఫండమెంటల్స్‌కు మించి ర్యాలీ చేశాయని, విలువలు అధిక స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయాల్సిన తరుణమని క్రెడిట్‌సూసీ నివేదిక తెలియజేసింది. పొదుపు నిధులు తరలి రావడం, జీఎస్టీ తర్వాత కార్పొరేట్‌ ఆదాయ అంచనాలు మెరుగుపడడం, అమెరికాతో వాణిజ్య యుద్ధం విషయంలో భారత్‌ నిలకడగా ఉండడం వంటి అంశాల తోడ్పాటుతో భారత ఈక్విటీల విలువలు అధిక స్థాయికి చేరాయని వివరించింది. ‘‘కార్పొరేట్‌ ఆదాయలు మరింత

దేశీయ పరిశ్రమపైనా...అమెరికా సుంకాల ప్రభావం

Monday 17th September 2018

న్యూఢిల్లీ: అల్యూమినియం, స్టీల్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది. స్టీల్‌ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం మేర పన్నును ఈ ఏడాది మే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే, కచ్చితంగా ఎంత మేర ప్రభావం పడుతుందన్న అంచనా వేయడం కష్టమని, భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో

Most from this category