STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 22nd April 2019
Markets_main1555912481.png-25256

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఎల్‌ అండ్‌ టీ:-
ఎలక్ట్రానిక్స్‌, అటోమెషన్‌ రంగంలో సేవలు అందించే సచీంద్ర అండ్‌ మాక్రితి విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది.
స్పైస్‌ జెట్‌:- విమానయాన రంగంలో కీలకమైన సాంకేతిక కోడ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఎమిరేట్స్‌ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
బోరోసిల్‌ గ్లాస్‌వర్క్స్‌:- అనుబంధ సంస్థ క్లాస్‌ప్యాక్‌లో అదనంగా రూ.5 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. 
మెజెస్కో:- క్లౌడ్‌ రంగంలో తన సేవలను విస్తరించుకునేందుకు రెడీ-టు-యూజ్‌ యాప్‌ను ఆవిష్కరించింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌:- ఇటీవల శ్రీకాకుళం యూనిట్‌లో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్వహణ లోపం కారణంగా 4 అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 
తంగమలై జూవెలరీస్‌:- కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 
కార్పోరేషన్‌ బ్యాంక్‌:- బ్రిక్‌ వర్క్స్‌ రేటింగ్‌ సంస్థ బాం‍డ్లపై రేటింగ్‌ను ఎ(ప్రతికూలం) నుంచి ఎ(స్థిరత్వానికి) సవరించింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- మౌలిక రంగంలో రుణాలను మంజూరు చేసేందుకు నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో సేవలు అందించే శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. 
జీవీకే పవర్‌:- అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఫండ్‌ సంస్థలు జీవీకే అనుబంధ సం‍స్థ జీవీకే ఏయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 49శాతం వాటాను ఈక్విటీ షేర్ల రూపంలో కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై సంబంధిత వర్గాలు స్పందించడం లేదు.
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర:- ఏప్రిల్‌ 29న జరిగే బోర్డు మీటింగ్‌లో క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. 
డీహెచ్‌ఎల్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ కమర్షియల్‌ పేపర్స్‌పై రేటింగ్‌ను ఎ3(+) నుంచి ఎ2(+)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
ఎస్‌బీఐ:- ఏప్రిల్‌ 24న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ అంశంపై చర్చించనుంది.
టాటా స్పాంజ్‌ ఐరన్‌:- టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌గా పేరును మార్చుకోనుంది.
నేడు క్యూ4 ఫలితాలను వెల్లడించనున్న కొన్ని ప్రధాన కంపెనీల వివరాలు:- ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, గోవా కార్బన్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌, శివ సిమెంట్స్‌, స్వరాజ్‌ ఇంజనీరింగ్స్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌You may be interested

కీలక మద్దతుల వద్ద కొనుగోళ్లకు ఛాన్స్‌

Monday 22nd April 2019

సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం సూచీలు నష్టాల్లో ఆరంభమ్యాయి. నిఫ్టీ కీలక 11700 పాయింట్లకు దిగువన ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పతనం, ఎన్నికల అస్థిరత తదితర అంశాలు సూచీలను కుంగదీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్దకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా లాంగ్‌ పొజిషన్లకు 11550 పాయింట్లను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. షార్ట్‌ పొజిషన్లకు 11860

భారీ నష్టంతో ఆరంభం

Monday 22nd April 2019

మూడు రోజుల విరామం అనంతరం ప్రారంభమైన మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ప్రారంభమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌, అటో షేర్ల పతనం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పతనమైన 39, 040 వద్ద నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 11,727.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈవారంలో పలు కీలక కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను ప్రకటించనుండం, సాదారణం ఎన్నికల్లో భాగంగా రేపు(మంగళవారం) పలు రాష్ట్రాల్లో​3వ విడుతలో 116 లోక్‌సభ

Most from this category