STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 31st December 2018
Markets_main1546226140.png-23318

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి:-
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:-  త‌న అనుబంధ సంస్థ రిల‌య‌న్స్ ఇండస్ట్రీయ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్(ఆర్ఐఐహెచ్ఎల్‌) రూ.75 కోట్ల‌కు మించకుండా ఈక్విటీ వాటాల కొనుగోలుకు పున‌రుత్పాద‌క కంపెనీ కనోడా ఎన‌ర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్(కేఈఎస్ఎల్‌) కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈ ఒప్పందం త‌ర్వాత కేఈఎస్ఎల్‌లో 88శాతం వాటా ఆర్ఐఐహెచ్ఎల్ సొంతమవుతుంది.
కేడిలా హెల్త్‌కేర్‌:- మెటిమెల నివార‌ణ చికిత్సలో వినియోగించే క్లైండమిసిన్ ఫాస్ఫేట్, బెంజోయిల్ పెరాక్సైడ్ జెల్‌ను మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది.
అంబ‌ర్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- ప్రమోట‌ర్ కంపెనీ ఎవ‌ర్ ఎంట‌ర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలో 51శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గ‌డువు మ‌రింత పొడిగించాల‌ని ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎవ‌ర్‌) ప్రమోట‌ర్లు కోరారు.  కంపెనీలో ఇప్పటికి వ‌రకూ ఎవ‌ర్ వాటా 19శాతం మాత్రమే ఉంది. ఎవ‌ర్ ప్రమోట‌ర్ల అభ్యర్థనను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న అంబ‌ర్ఎంట‌ర్ ప్రైజెస్ బోర్డు గ‌డువును మార్చి 31వర‌కు పొడిగించింది.
శిల్పి కేబుల్ టెక్నాలజీస్:- కంపెనీ సీఈవో ప‌దవికి శైలేంద్ర కుమార్ రాజీనామా చేశారు.
క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్:- కంపెనీ రూ .176.59 కోట్లను డెరెక్ట్ అసైన్‌మెంట్ లావాదేవీని పూర్తి చేసింది. ఈ లావాదేవీతో కంపెనీ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 5 సెక్యూరిటైజేషన్ లావాదేవీలు, రెండు డైరెక్ట్ అసైన్మెంట్ లావాదేవీలు పూర్తి చేసి రూ.909.70 కోట్లు ఆర్జించింది.
ఆవాస్ ఫైనాన్షియ‌ర్స్‌:- తాజా రూ.400 రుణాల‌ను మంజూరు చేసేందుకు బోర్డు నుంచి అనుమతులు ద‌క్కించుకుంది.
ఇన్ఫీభీమ్ అవెన్యూస్‌:- యూనికామ‌ర్స్ ఈ-సెల్యూష‌న్ ప్రైవేట్ లిమిటెడ్తో గతంతో కుదిరిన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ర‌ద్దైన‌ట్లు కంపెనీ ఎక్స్చేంజ్‌ల‌కు స‌మాచారం ఇచ్చింది. ఈ ఏడాది మే నెల‌లో ఇరు కంపెనీల మ‌ధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ.120 కోట్లుగా ఉంది.
బ‌ట్టర్ ఫ్లై గాంధీమ‌తి అప్లైన్‌సెస్‌:- ధీర్ఘ‌కాలిక‌, స్వల్పకాలిక బ్యాంక్ రుణాలకు రేటింగ్ సంస్థ క్రిసెల్ మ‌రోసారి రేటింగ్ ఇచ్చింది.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేష‌న్‌:-  షేర్ల బైబ్యాక్ ఆఫ‌ర్ అర్హత క‌లిగిన షేర్‌హోల్డర్లను ఎంపిక చేసేందుకు జ‌న‌వ‌రి 11ని రికార్డు తేదిగా నిర్ణ‌యించింది.   
జేకే సిమెంట్స్ :- క్యూఐపీ ప్రక్రియ‌ను పూర్తి చేసింది. ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధ‌రను రూ.695.80లుగా నిర్ణయించింది.
సిండికేట్ బ్యాంక్‌:- కేంద్ర ప్రభుత్వం మూల‌ధ‌న నిధుల సాయంలో భాగంగా రూ.1632 కోట్లను  అందుకుంది.
ఐడీబీఐ బ్యాంక్‌:- ఎల్ఐసీలో 51శాతం వాటా విక్రయ ప్రక్రియ‌లో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధ‌ర రూ.60.73ల వ‌ద్ద 232 కోట్ల ఈక్వీటీ షేర్ల‌ను  కేటాయింపు చేసింది. ఈ మొత్తం ఒప్పందం విలువ రూ.14,500 కోట్లుగా ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప‌ద్దతిలో రూ.6000 కోట్ల విలువైన డిబెంచ‌ర్లను జారీ చేసింది.
ఐఎల్అండ్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌:- కంపెనీలో ద్రవ్యకొరత కార‌ణంగా డిసెంబ‌ర్ 28వ తారీఖున ఎన్‌సీడీలపై  డిబెంచ‌ర్ హోల్డర్లకు వ‌డ్డీల‌ను చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంది.  
ఐసీఐసీఐ బ్యాంక్‌:- ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిప‌దిక‌న బాసెల్-3 బాండ్ల జారీ ద్వారా రూ.1,140 కోట్లు స‌మీక‌రించింది. ఆ బాండ్లకు వార్షిక కూప‌న్ రేటు 9.90శాతంగా ఉంది. కేర్‌, ఇక్రా, క్రిసిల్ రేటింగ్ సంస్థ‌లు ఈ బాండ్లకు ఎఎ రేటింగ్‌ను కేటాయించాయి.
పీవీఆర్:- క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ బ‌య్యర్లకు(క్యూఐబీ) షేర్లు జారీ చేయ‌డం ద్వారా రూ.750 కోట్ల స‌మీక‌ర‌ణ‌కు సిద్ధమైంది.  ఈ మేర‌కు తమ డైరెక్ట‌ర్ల బోర్డు ఆమోదం తెలిపిన‌ట్లు కంపెనీ ఎక్చ్సేంజీల‌కు సమాచారం ఇచ్చింది.


RIL

You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 31st December 2018

ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో సోమవారం  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 9.00 గంటల సమయానికి 39 పాయింట్ల పెరుగుదలతో 10,960 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10921.50 పాయింట్లతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు నేడు ఆసియా

వచ్చే వారం ఎలా ఉంటుంది?

Saturday 29th December 2018

ఈ వారాంతానికి నిఫ్టీ దాదాపు ఒక్క శాతం లాభంతో 10860 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఈ వారం మార్కెట్లు భారీ పతనాలు చూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి డిసెంబర్‌లో దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. రాబోయే రోజుల్లో అమెరికా మార్కెట్లు మరింత పతనమవుతాయన్న భయాలున్నాయి. చార్టులేమంటున్నాయి? నిఫ్టీ క్రమంగా ఉత్సాహం కోల్పోతున్న సూచనలున్నాయి. చార్టుల్లో చిన్న చిన్న క్యాండిల్స్‌ ఏర్పడుతున్నాయి. పలు కీలక ఇండికేటర్లు సెల్‌

Most from this category