STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th May 2019
Markets_main1557461043.png-25645

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సుందరమ్ ఫాస్ట్నెర్స్‌:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ప్రతి ఈక్విటీ షేరుపై రూ.3.10 రెండో మధ్యంతర డివిండెండ్‌ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ బ్రాండ్స్‌ హాలేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌తో 100శాతం ఈక్విటీ వాటాను రూ.650 కోట్లకు కొనుగోలు చేసేందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
వెల్‌స్పాన్‌ కార్పో:- షేర్ల బై బ్యాక్‌ ఆఫర్‌ అంశంపై చర్చించేందుకు మే 14న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. అలాగే సమావేశంలో 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర డివిండెండ్‌ చెల్లింపు పై కూడా చర్చించనుంది. 
క్వెస్‌ కార్పోరేషన్‌:- గ్రీన్‌పీస్‌ ల్యాండ్‌స్పేస్‌లో 100శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. 
ఎడిల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- తన అనుబంధ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌ రూ.1000 గల సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసి మొత్తం రూ.1,500 మిలియన్ల సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. 
బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ను ‘‘ఏ’’గా కేటాయించడంతో పాటు అవుట్‌లుక్‌ను ‘‘నెగిటివ్‌’’ నుంచి స్టేబుల్‌కు పెంచింది.
ఎల్‌ అండ్‌ టీ:- ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా మే 09న మైండ్‌ ట్రీ కంపెనీ చెందిన 33.05లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.

నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేసే కొన్ని ప్రధాన కంపెనీలు:- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటర్స్‌, గ్లాస్కో స్మిత్‌ కన్జూ‍్యమర్‌ హెల్త్‌కేర్‌, గుజరాత్‌ పోలీ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌టీ మీడియా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కజారియా సిరామిక్స్‌, మెర్క్‌, నాసిల్‌, ఒబేరాయ్‌ రియల్టీ, పంజాజ్‌ కెమికల్స్‌, పీవీఆర్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌, వీ2 రిటైల్‌, వక్రంజీ, వెంకాయ్‌స్‌, వీ-మార్ట్‌ రిటైల్స్‌, వీఎస్‌టీ టిల్లర్‌ ట్రాక్టర్స్‌ 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 10th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,287.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాకు చెందిన 200మిలియన్ల దిగుమతులపై అదనంగా విధించిన 15శాతం టారీప్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. చైనా ఈ టారీఫ్‌ పెంపు అంశంపై ప్రతీకార చర్యలు తప్పవని వ్యాఖ్యానించినప్పటికి.., ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ట్రేడ్‌

లాభాల ప్రారంభం

Friday 10th May 2019

అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల ఫలితంపై మార్కెట్లో డోలాయమాన స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 37632 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,314 పాయింట్ల వద్ద మొదలయ్యింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో శుక్రవారం ఉదయం షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా ఆసియా

Most from this category