STOCKS

News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 19th March 2019
Markets_main1552970189.png-24678

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు
ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌:-
రూ.10 కోట్ల విలువైన బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధర రూ.130లుగా నిర్ణయించారు.
వక్రంజీ:- వైట్‌ లేబుల్‌ ఏటీఎంల పునరుద్ధరణకు ఆర్‌బీఏ ఆమోదం తెలిపింది. 
ఏజిస్ లాజిస్టిక్స్:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.0.50ల డివిడెండ్‌ను చెల్లించనుంది. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- జిరాక్స్‌ కార్పోరేషన్‌ సం‍స్థ భాగస్వామ్యంతో షేర్‌ బిజినెస్‌ వ్యాపారంలోని ప్రవేశించింది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- ఎరిక్సన్‌కు చెల్లించిన రూ.458 కోట్ల రుణాన్ని తీర్చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
ఆర్తి ఇండస్ట్రీస్‌:- షేర్ల జారీ, క్యూఐపీతో పాటు ఇతర పద్ధతుల ద్వారా నిధుల సమీకణర ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. 
కాఫీ డే ఎంటర్‌ప్రైజస్‌:- మైండ్‌ ట్రీ కంపెనీ వాటాలను విక్రయించేందుకు తన అనుబంధ సం‍స్థ కాఫీ డే ట్రేడింగ్‌, ప్రమోటర్‌ వీ.జీ సిద్ధార్థ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
మెజెస్కో:- అమెరికాలో తన అనుబంధ సం‍స్థ ఇండియాలోని ఇన్సూరెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. 
ఐఎల్‌&ఎఫ్‌సీ ట్రాన్స్‌ఫోర్టేషన్‌ నెట్‌వర్క్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై వడ్డీతో పాటు అసలు చెల్లించడంలో కూడా విఫలమైంది. 
హోటల్‌ లీలా వెంచర్‌:- బ్రూక్‌ ఫీల్డ్‌ కంపెనీకి హాస్పిటాలిటీ, హోటల్‌ నిర్వహణ వ్యాపారాన్ని విక్రయించింది.
ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజనీరింగ్స్‌:- ఈక్విటీ షేర్ల ఉప విభజనకు రికార్డు తేదిని మార్చి 29గా నిర్ణయించింది.
రతన్‌ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా వికాశ్‌ ఆడుకియా నియమితులయ్యారు. 
అదానీ పోర్డ్స్‌:- కంపెనీ బోర్డు 14000ల ఎన్‌సీడీల బై బ్యాక్‌ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1400 కోట్లను సమీకరించాలనే యోచనలో ఉంది.
ఎఫ్‌ఐఈఎం ఇండస్ట్రీస్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రతి షేరుపై రూ.8ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
పిడిలైట్‌ ఇండస్టీ‍్రస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా పీ. గణేష్‌ రాజీనామా చేశారు.

 



You may be interested

భారత్‌కు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌

Tuesday 19th March 2019

గోల్డ్‌మన్‌ సాక్స్‌ నిర్ణయం భారత మార్కెట్‌ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకటించింది. దీంతో పాటు నిఫ్టీ ఏడాది టార్గెట్‌ను 12500 పాయింట్లుగా నిర్ణయించింది. మార్చి ఆరంభం నుంచి దేశ మార్కెట్లు కీలక నిరోధాలు దాటి పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ 38వేల పాయింట్లను, నిఫ్టీ 11400 పాయింట్లను దాటేశాయి. ఈ ర్యాలీ ఎఫ్‌ఐఐల కారణంగా ఏర్పడిన ప్రీఎలక‌్షన్‌ ర్యాలీ అని గోల్డ్‌మన్‌సాక్స్‌ తెలిపింది. మార్చిలో

లాభాల ప్రారంభం..వెంటనే నష్టాల్లోకి

Tuesday 19th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు లాభాలతో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్న కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల స్వీకరణ జరగడంతో హెవీవెయిట్‌ షేర్లు ప్రారంభగరిష్టస్థాయి నుంచి తగ్గాయి. 100 పాయింట్లకుపైగా లాభంతో 38,200 పాయింట్ల సమీపంలో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,243 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత ఐదు నిముషాల్లోనే 38,091 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. అలాగే

Most from this category