STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 5th February 2019
Markets_main1549341674.png-24015

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
కోల్‌ ఇండియా:- రూ.1050 కోట్ల విలువైన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రణాళికలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.235 చొప్పున మొత్తం 4.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
ఫ్యూచర్‌ రిటైల్‌:- ప్రమోటర్‌ గ్రూప్‌ సం‍స్థ ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.2000 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.503ల చొప్పున మొత్తం రూ.3.9 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- అదనపు స్పెక్ట్రమ్‌ కేటాయించినందుకు వసూలు చేసిన రూ.2,000 కోట్లు వాపసు ఇవ్వాలని టీడీశాట్‌ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగాన్ని ఆదేశించింది.
అశోక్‌లేలాండ్‌:- అశ్లే ఏవియేషన్స్‌లో 4.50లక్షల ఈక్విటీ షేర్లకు సమానమైన 11.26శాతం వాటాను చేజిక్కించుకుంది. ఈ వాటా కొనుగోలుతో అశ్లే ఏవియేషన్స్‌ సంస్థను పూర్తిగా సొంతం చేసుకుంది.
హెచ్‌ఈజీ:- కొత్త సీఈఓగా గుల్షన్‌ కుమార్‌ నియామకానికి హెచ్ఈజీ బోర్డు ఆమోదం తెలిపింది.
వేదాంతా లమిటెడ్‌:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ కంపెనీ షేరుపై రేటింగ్‌ను "స్థిరత్వం" నుంచి "ప్రతికూలం"కు సవరించింది.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు
టెక్‌ మహీంద్రా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, డీఎల్‌ఎఫ్‌, గెయిల్‌ ఇండియా, ఏసీసీ(ఇండియా), భెల్‌, మారికో, ఐటీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ , అపోలో టైర్స్‌, ప్రతాప్‌ స్నాక్స్‌, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెన్స్‌, బ్లూ స్టార్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అక్షర్‌కెమ్‌ ఇండియా, ఆడ్‌ల్యాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హైటెక్‌ కార్పోరేషన్‌, ఫెయిర్‌కెమ్‌ సెష్పాలిటీ, లోటస్‌ ఐ హాస్పిటల్, స్నో మాన్‌ లాజిస్టిక్స్‌, స్పైస్‌ మోబిలిటీ, పిరమిల్‌ ఫైతాన్‌కేర్‌, టాటా కెమికల్స్‌, సుజ్లాన్‌ టెక్స్‌టైల్స్‌, ఆర్షియా, వీ-మార్ట్‌ రీటైల్‌, ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌, ఉషా మార్టిన్‌, ట్రెంట్‌, బాంబే డైయింగ్‌, బిర్లా కార్పోరేషన్‌, జై కార్పోరేషన్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, టొరెంటో పవర్‌, జై బాలాజీ ఇండస్ట్రీస్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌, ఎల్‌ టీ ఫుడ్స్‌, ఓస్వాల్‌ ఆగ్రో మిల్స్‌, హోటల్‌ రూబీ, ఓస్వాల్‌ కెమికల్స్‌&ఫెర్టిలైజర్స్‌, యూనిటైడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌, మంగళూర్‌ రిఫైనీన పెట్రోకెమికల్స్‌, కామత్‌ హోటల్స్‌, డిష్‌ టీవీ, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, పీటీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఐనోక్స్‌, శోభ, సీఈఎస్‌ఈ, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌.You may be interested

వారం కనిష్టానికి పసిడి

Tuesday 5th February 2019

డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీతో మంగళవారం పసిడి ధర వారం రోజుల కనిష్టానికి చేరుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో పాటు జనవరిలో అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు నష్టపోయి

స్వల్ప నష్టంతో ప్రారంభం, వెనువెంటనే లాభాల్లోకి

Tuesday 5th February 2019

మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ సూచీలు వెనువెంటనే లాభాల్లోకి మళ్లాయి. 36,578 పాయింట్ల వద్ద స్వల్పనష్టం‍తో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 45 పాయింట్ల లాభంతో 36,650 గరిష్టస్థాయికి చేరింది. అలాగే 4 పాయింట్ల నష్టంతో 10,908 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొద్ది నిముషాల్లోనే 16 పాయింట్ల లాభంతో 10,928 పాయింట్ల వద్దకు చేరింది. హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌, మహింద్రా, పవర్‌గ్రిడ్‌లు 1 శాతంపైగా

Most from this category