STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 20th December 2018
Markets_main1545279802.png-23090

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఫైజర్‌:- బ్రిటన్‌కు చెందిన గ్లాస్కోస్మిత్‌లైన్‌ పీఎల్‌సీతో అమెరికాలోని తన మాతృసంస్థ ఫైజర్‌ ఇంక్‌ వ్యూహాత్మక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఇరు సంస్థల భాగస్వామ్యంలో  ప్రపంచస్థాయి కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
టీసీఎస్‌:- కెనడాలో నెక్ట్స్‌ జనరేషన్‌ క్లౌడ్‌ను ప్రారంభించింది.
కెనరా బ్యాంక్‌:- బాసిల్‌-III బాం‍డ్ల జారీ ద్వారా రూ.3000 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను ఒకేసారి లేదా వివిధ దఫాలుగా సమీకరించవచ్చని కంపెనీ తెలిపింది.
భాగ్యనగర్‌ ఇండియా:- బ్యాంకు రుణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేర్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ రేటింగ్‌ బిబిబి(+)నుంచి బిబిబి(స్థిరత్వం)కు సవరించింది
కమ్మిన్స్‌ ఇండియా:- కంపెనీ అంజులైన చిబ్‌ దగ్గల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెంట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
సిండికేట్‌ బ్యాంక్‌:- ప్రభుత్వానికి ప్రతి షేరు రూ.239.63ల వద్ద మొత్తం 18.36 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. ఈ ఈక్విటీ షేర్ల విక్రయంతో బ్యాంకులో ప్రభుత్వం వాటా 76.16శాతం నుంచి 73.07శాతానికి పెరిగింది.
ఓమ్‌ మెటల్స్‌:- రాజస్థాన్‌ ప్రభుత్వం నుంచి రూ.615.16కోట్ల ఈపీసీ ఆర్డర్లును దక్కించుకుంది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- ఎన్‌సీఎల్‌టీ ఎరిక్సన్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌ పిటిషన్‌ విచారణను జనవరి 22, 2019 నాటి వాయిదా వేసినట్లు కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
వాక్‌హార్డ్‌:- నిధుల సమీకరణకు ఆమోదం తెలిపేందుకు కంపెనీ నిధుల సమీకరణ కమిటి డిసెంబర్‌ 22, 2018న సమావేశం నిర్వహించనుంది.
జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌:- ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.135.95లు వద్ద 18లక్షల షేర్ల జారీకి, అలాగే ప్రతి వారెంట్‌ ధర రూ.135.95 వద్ద మొత్తం 13లక్షల కన్వర్టబుల్‌ వారెంట్ల జారీకి కంపెనీ ఫైనాన్స్‌ కమిటి ఆమోదం తెలిపింది.
మణిప్పురం ఫైనాన్స్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.1000 ముఖ ప్రతివిలువ కలిగిన 42,309 అన్‌లిస్టెడ్‌ అన్‌సెక్యూర్డ్‌ రీడమబుల్‌ డిబెంచర్ల జారీ చేసి రూ.4.23కోట్ల నిధులను సమీకరించేందుకు కంపెనీ ఫైనాన్షియల్‌ రిసోర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటి ఆమోదం తెలిపింది.
అలెంబిక్‌ ఫార్మా:- గుజరాత్‌లోని ఏపీఐ ఫ్యాకల్టీ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ జీరో అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీచేసింది. ఈ యూనిట్‌లో గతవారం 17న యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
సర్ఫ్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా చక్రవర్తి శర్మ రాజీనామాకు బోర్డు ఆమోదం తెలిపింది.
డీఎఫ్‌ఎం ఫుడ్స్‌:- ధీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేర్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ రేటింగ్‌ను ఎ(స్థిరత్వం) పెంచింది.You may be interested

మళ్లీ పావుశాతం వడ్డించిన ఫెడ్‌

Thursday 20th December 2018

బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటు  పెంపు 2.25-2.50 శాతానికి చేరిన రేట్ల శ్రేణి ‘వడ్డీ రేట్లు పెంచి మళ్లీ తప్పు చేయవద్దు’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ రిజర్వుకు పంపిన హెచ్చరిక. అయితే ఫెడరల్‌ రిజర్వు ట్రంప్‌ హెచ్చరికను ఎప్పటిలాగే బేఖాతరు చేసింది. తన విధానాలకు కట్టుబడుతూ కీలక పాలసీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్‌ రేట్ల శ్రేణి 2.25-2.5 శాతానికి చేరింది. దీంతో ఈ

రూపీ డౌన్‌

Thursday 20th December 2018

ఫెడ్‌ నిర్ణయం, ఆర్‌బీఐ మినిట్స్‌ ప్రభావం..  ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు తర్వాత ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు బుధవారం విడుదలైన ఆర్‌బీఐ పాలసీ సమావేశ వివరాలు.. అధిక ద్రవ్యోల్బణ, వృద్ధి రేటు క్షీణతపై ఆందోళనలు రేకెత్తించడంతో సెంటిమెంట్‌ దెబ్బతింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.54 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి

Most from this category