STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 4th September 2018
Markets_main1536035449.png-19928

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఐడియా సెల్యులార్:- రూ.1500 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- ఈ ఆర్థిక సంవత్సర తొలిత్రైమాసిక ఫలితాలను విడుదల చేసేందుకు సెప్టెంబర్‌ 11న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
యాక్సిస్‌ బ్యాంకు:- ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీ) పథకంలో భాగంగా ప్రతి షేరు ధర రూ.2ల చొప్పున మొత్తం 2లక్షల ఈక్విటీ షేర్లను తన ఉద్యోగులకు కేటాయించింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ రేటింగ్‌ను రేటింగ్‌ సంస్థ ఇక్రా బిబి(+)నుంచి బిబికు సవరించింది.
పర్‌సిస్టెంట్‌ సిస్టమ్స్‌:- హెరాల్డ్‌ టెక్‌ కంపెనీని సొంతం చేసుకుంది.
జీఎంఆర్‌ ఇన్ఫ్రా:- నాలుగు ఇండోనేషియా బొగ్గు కంపెనీల్లో వాటాను ఉపసంహరించుకుంది.
మోతీలాల్‌ ఓస్వాల్‌:- సంచలనం సృష్టించిన ఎన్‌ఎస్‌ఈఎల్‌ అవినీతీ కేసులో మోతీలాల్‌ ఓస్వాల్‌కు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు 3వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సెబీ ఆదేశించింది.
జీటీఎల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- తనపై యూనియన్‌ బ్యాంకు తీసుకున్న దివాళా సృ‍్మతి కోడ్‌కు వ్యతిరేకంగా హైకోర్టును ఆదేశించింది.
రిలయన్స్‌ ఇన్ఫ్రా:- మహారాష్ట్ర ప్రభుత్వానికి బాకీ పడ్డ రూ.2640 కోట్ల విద్యుత్‌ బకాయిలను చెల్లించింది.
ఎన్‌హెచ్‌పీసీ:- ఇండియాలో భెల్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హైడ్రో-ఎలక్ట్రానిక్‌ ప్రాజెక్ట్‌లో మూడేళ్లపాటు తన సేవలను అందించేందుకు ఈ కంపెనీతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మారికో:- రానున్న 5ఏళ్లలో కంపెనీ వాల్యూమ్‌ గ్రోత్‌ను 10శాతం పెంపును లక్ష్యంగా పెట్టుకుంది.
వీఎస్‌టీ టిల్లర్‌:- ఆగస్ట్‌లో 1646 పవర్‌ టిల్లర్స్‌ను, 517 ట్రాక్టర్లు విక్రయించింది.
యుకేన్‌ ఇండియా:- బోనస్‌ ఇష్యూకు రికార్డు తేదిగా సెప్టెంబర్‌ 14ను నిర్ణయించింది.
టాటా క్యాపిటల్‌ ఫైనాన్షియల్:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.7,500 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- కర్ణాటకలోని విజయనగర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 18 మిలియన్స్‌ టన్నులకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ 18 మిలియన్స్‌ టన్నులుగా ఉంది.
హికాల్‌:- ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్ సంస్థ హికాల్‌కు చెందిన 40లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.166.51చొప్పున విక్రయించింది. ఇదే కంపెనీకి చెందిన 20లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు రూ.166.50 చొప్పున అశిష్‌ ఖచోలియా కొనుగోలు చేశారు.You may be interested

విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయండి

Tuesday 4th September 2018

హైదరాబాద్‌: కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిలయన్స్ పవర్ కోరింది. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (సీఏపీఎల్‌) ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)కు ఒక లేఖ రాసింది. ఒప్పందం రద్దుకు ప్రతిగా తాము సమీకరించిన 2,600 ఎకరాల స్థలాన్ని అప్పగిస్తామని పేర్కొంది. ఇందుకోసం తమ

కొత్త కనిష్టానికి రూపాయి

Tuesday 4th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి పతనమైంది. వాణిజ్య ఉద్రిక్తతల భయాల వల్ల వర్ధమాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, అర్జెంటీనా సహా టర్కీలో సంక్షోభాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.34 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71.21తో పోలిస్తే 0.19 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం

Most from this category