STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 15th February 2019
Markets_main1550205016.png-24206

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
జెట్ ఎయిర్‌వేస్‌:-
ఆర్థిక క‌ష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కేందుకు ప్రోవిజ‌న‌ల్ రెల్యూష‌న్ ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రణాళిక‌లో భాగంగా కంపెనీ రుణాలను ఈక్విటీ షేర్ల కింద మార్చనుంది.  
మిండా ఇండ‌స్ట్రీస్‌:- హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ విలీనాన్ని ఆమోదం తెలిపింది. 100 షేర్లు కలిగిన హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ షేర్‌హోల్డర్లకు విలీన ప్రక్రియతో 152 మిండా షేర్లు లభించనున్నాయి.  
జేకే టైర్ అండ్ ఇండ‌స్ట్రీస్‌:- ప్రిఫ‌రెన్షియ‌ల్ బేసిస్ ప‌ద్ధతిలో ప్రమోట‌ర్ గ్రూప్‌కు ప్రతి షేరు ధ‌ర రూ.2ల చొప్పున కేటాయింపు ద్వారా రూ.200 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. 
రెస్పాన్షివ్ ఇండ‌స్ట్రీస్‌:- కంపెనీ అద‌న‌పు డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా మృణాళ్ శెట్టి నియ‌మానికి బోర్డు ఆమోదం తెలిపింది. 
బీజీఆర్ ఎన‌ర్జీ సిస్టమ్స్‌:- త‌న అనుబంధ సంస్థ పెట్టుబ‌డుల‌ను విక్రయించేందుకు బోర్డు అనుమతులు కోరింది.
టాటా ప‌వ‌ర్ సోలార్‌:- హైద‌రాబాద్‌లో  రెసిడెన్షియ‌ల్ రూఫ్‌టాప్ సెల్యూష‌న్‌ను ఆవిష్కరించింది. 
క్రిధాన్ ఇన్ఫ్రా:- సింగ‌పూర్ ఆధారిత అనుబంధ సంస్థ కేహెచ్‌ ఫోర్జ్ లిమిటెడ్ రూ.187 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. 
ఇన్ఫోసిస్‌:- అమెజాన్ వెజ్ స‌ర్వీస్ క్లౌడ్ స‌ర్వీసుల మెయింటైన్స్ కోసం సాఫ్ట్‌వేర్ సేవ‌ల‌ను అందించేందుకు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌:- నేష‌న‌ల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి త‌న అనుబంధ సంస్థ పీఎన్‌సీ త్రివేణీ సంగ‌మ్ హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2159 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
జే కుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌:- డిల్లీ మెట్రో రైల్వే కార్పోరేష‌న్ నుంచి రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. 
తారా సాఫ్ట్‌వేర్‌:- వివిధ కంపెనీల‌కు సాఫ్ట్‌వేర్ సేవ‌ల‌ను అందించేందుకు రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది. 
నేడు క్యూ3 ఫ‌లితాల‌ను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీల వివ‌రాలు:- ఆమ్టెక్ అటో, గ్రుహ్ ఫైనాన్స్‌, ఇంటిగ్రేడెడ్ టెక్నాల‌జీస్‌, సిద్ధా వెంచ‌ర్స్‌, వీసీయూ డాటా మేనేజ్‌మెంట్.You may be interested

ఈ నెలాఖరు వరకు ఇంతే!

Friday 15th February 2019

మార్కెట్‌పై ఎస్‌బీఐ క్యాప్‌ అంచనా కొద్దికాలంగా స్వల్పరేంజ్‌లో కదలాడుతున్న సూచీలు ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగవచ్చని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేష్‌ సబారడ్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు పెద్దగా కదలికలు చూపకున్నా, ఈ నెల్లో ఎఫ్‌ఐఐల ప్రవాహం మాత్రం బలంగా ఉందన్నారు. కానీ సూచీలు మాత్రం ఎంత పాజిటివ్‌ వార్తలు వినిపిస్తున్నా ఏమాత్రం చలించడంలేదని, ఇదే ధోరణి ఇంకో రెండు వారాలపాటు కొనసాగవచ్చని చెప్పారు. వచ్చే నెలారంభంలో రెండు అంశాలు

నష్టాల ప్రారంభం

Friday 15th February 2019

ప్రపంచమార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం మరోసారి నష్టాలతో ప్రారంభమైంది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అస్థితర వాతావరణ సూచీల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రూపాయి పతనంతో ఐటీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అ‍త్యధికంగా ఫార్మా షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో షేర్ల సైతం నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 65

Most from this category