News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 13th March 2019
Markets_main1552451121.png-24569

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు 
మెజెస్కో:-
అమెరికా అనుబంధ సంస్థ యూరోపిన్‌ కార్యనిర్వహణ అధికారిగా నార్మన్‌ కారోల్‌ను నియమిస్తున్నట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. 
ఎమ్‌ఎస్‌టీసీ:- నేడు ఐపీఓ ప్రారంభం కానుంది. ప్రైజ్‌బాండ్‌ రూ.121-128లుగా నిర్ణయించారు.
ఎన్‌ఎమ్‌డీసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.1 ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.52 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు రికార్డు తేదిని మార్చి 25గా నిర్ణయించింది.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.100 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. 
ఇన్ఫోసిస్‌:- శ్రీలంక దేశానికి చెందిన హటన్‌ నేషనల్‌ బ్యాంక్‌కు సాంకేతిక సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
యాక్సిస్‌ బ్యాంక్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌, తాత్కలిక కార్యనిర్వహణాధికారిగా రాకేష్‌ మఖిజ నియమితులయ్యారు.
టీవీఎస్‌ మోటర్‌:- తన అనుబంధ సం‍స్థ టీవీఎస్‌ క్రిడెట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో కంపెనీలో రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 
కజారియా సిరామిక్స్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్లుగా రాజ్‌ కుమార్‌ భార్గవ్‌, డీబీ ప్రసాద్‌లను తిరిగి నియమితులయ్యారు.
కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్స్‌:- శ్రీ శుభమ్‌ లాజిస్టిక్‌ కంపెనీ విలీన ప్రక్రియను పూర్తి చేసింది. 
వీ-మార్ట్‌ రిటైల్‌:- హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్త స్టోర్‌లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్‌ల సంఖ్య 207కు చేరుకుంది.
జెట్‌ ఏయిర్‌వేస్‌:- ఆర్థిక సంక్షోభం కారణంగా మరో 4 విమానాలను ప్రయాణాన్ని రద్డు చేస్తున్నట్లు ప్రకటించింది.
సీఎంఐ:- అండర్‌గ్రౌండ్‌ పవర్‌ కేబుల్స్‌ సరఫరా కోసం తొలిసారిగా మారిషస్‌ నుంచి ఎగుమతి ఆర్డర్‌ పొందింది.
భారతీ ఎయిర్‌టెల్‌:- భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 32శాతం వాటా విక్రయం కోసం బోర్డు అనుమతి పొందింది.You may be interested

మరో కొత్త గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th March 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ రెండో రోజూ రికార్డు ర్యాలీ చేస్తుంది. మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,480.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌ 175 పాయింట్లు లాభపడి 28662.10ల వద్ద కొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌

పాజిటివ్‌ ప్రారంభం, వెంటనే నష్టాల్లోకి

Wednesday 13th March 2019

బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్‌ సూచీలు... వెనువెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. 37,600 పాయింట్ల పైన 70 పాయింట్ల లాభంతో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 37,500 దిగువకు క్షీణించగా, 10,326 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,300 పాయింట్ల దిగువకు తగ్గింది. గత రాత్రి బ్రిటన్‌ ప్రధాని థెరాసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌..ఆ దేశపు పార్లమెంటు తిరస్కారానికి గురైన నేపథ్యంలోఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌

Most from this category