STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th October 2018
Markets_main1538713780.png-20878

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
టైటాన్‌ కంపెనీ:- ఈ ఆర్థిక సంవత్సరం తొలి సంవత్సరం వ్యాపార లావాదేవీల సమాచారాన్ని ఎక్స్సేంజ్‌లకు నివేదించింది.
 క్యుపిడ్:- బోనస్‌ షేర్ల ఇష్యూతో పాటు ఇతర వ్యాపార విషయాలను చర్చించేందుకు ఈ అక్టోబర్‌ 13న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
భూషణ్‌ స్టీల్‌:- ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1.05 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తిని చేయగా, 1.14 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను విక్రయించింది.
ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నాన్‌ - కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌, రీడమబుల్స్‌, సెక్యూరిటీలను జారీ చేసి రూ.350 కోట్ల సమీకరణకు సిద్ధమైంది.
పుంజ్‌లాయిడ్‌:- రుణాన్ని చెల్లించడంలో విఫలమైనందున ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేసింది.  
థామస్‌ కుక్‌(ఇండియా):- రూ.100 కోట్ల నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లకు గతంలో కేటాయించిన రేటింగ్‌ను తగ్గించింది.
కేడిలా హెల్త్‌కేర్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తన అనుబంధ సంస్థ జైడస్‌ బయోలాజిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఈఐఆర్‌ సర్టిఫికేట్‌ను సాధించింది.  
లుపిన్‌:- పొటాషియం క్లోరైడ్ ఓరల్ సొల్యూషన్ ఔషధాన్ని యూఎస్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.
చోళమండలం ఇండస్ట్రీస్‌:- బాం‍డ్ల జారీ ఇష్యూకు క్రిసెల్‌ ఎఎ(స్థిరత్వం)రేటింగ్‌ను కేటాయించింది.
మనోరమా ఇండస్ట్రీస్‌:- కంపెనికి చెందిన 10లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.192.63 చొప్పున ఇండియా మాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ విక్రయించింది.
ఐడీబీఐ బ్యాంకు:- బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 26శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్‌ ఆఫర్‌ రూ.12,602 కోట్లని పేర్కొంది.
జైప్రకాశ్‌ పవర్‌:- రుణాన్ని చెల్లించడంలో విఫలమైనందున కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దివాళా స్మృతి చట్టం కింద ఎన్‌సీఎల్‌టీకి పిటిషన్‌ ధాఖలు చేసింది.
టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ:- పండుగ సీజన్‌ సందర్భంగా కంపెనీ ‘‘టీవీఎస్‌ జూపిటర్‌ గ్రాండ్‌’ ’మోడల్‌ స్కూటీని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
డిక్సాన్‌ టెక్నాలజీస్‌:- ఆంధ్రప్రదేశ్‌లో షియోమి కంపెనీ కోసం ‘‘మిఎల్‌ఈడీ’’ టీవీ తయారీని ప్రారంభించింది.
భరత్‌ గేర్స్‌:- రైట్స్‌ ఇష్యూ ద్వారా షేర్‌హోల్డర్లకు ఈక్విటీ షేర్లను జారీ చేసే అంశాన్ని చర్చించేందుకు కంపెనీ బోర్డు సభ్యులు ఈ అక్టోబర్‌ 09న సమావేశం కానున్నారు.You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు

Friday 5th October 2018

నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న జైట్లీ న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్‌ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న

సుజుకీ ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ’ విడుదల

Friday 5th October 2018

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లో గురువారం తమ అడ్వెంచర్ టూరర్‌ బైక్‌ను విడుదలచేసింది. ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ ఏబీఎస్‌’ పేరిట విడుదలైన ఈ బైక్‌ ధర రూ.7.46 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఫోర్‌-సిలెండర్‌ 645 సీసీ ట్విన్‌ ఇంజిన్‌, అధునాతన భద్రతా ఫీచర్లు, యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌(ఏబీఎస్‌) ప్రత్యేకతలుగా పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచిడా మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో

Most from this category