STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 28th January 2019
Markets_main1548646592.png-23830

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావితమ‌య్యే షేర్ల వివ‌రాలు
లుపిన్ :- యూఎస్ఎఫ్‌డీఏ  పీతాంపూర్ యూనిట్‌-2లో త‌నిఖీలు పూర్తి చేసింది. యూనిట్‌లో నిర్వహ‌ణ లోపాల‌ను గుర్తించిన యూఎస్ఎఫ్‌డీఏ 6 అబ్జర్వేష‌న్ల‌తో కూడిన ఫామ్ 48 స‌ర్టిఫికేట్‌ను జారీ చేసింది.
జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌:-  జీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌ వాటా విక్రయించేందుకు...ఆ గ్రూప్‌ను రుణాలిచ్చిన బ్యాంకులు మూడు నెలల సమయాన్నిచ్చాయి. ప్రస్తుతానికి జీ షేర్లను విక్రయించబోమంటూ రుణదాతలు హామీ ఇవ్వడంతో ఆ గ్రూప్‌ అధినేత సుభాష్‌చంద్ర గట్టెక్కారు. 
ఇమామి:- జ‌ర్మనీకి చెందిన వ్యక్తిగ‌త సంర‌క్షణ కంపెనీ క్రీమ్ 21ను కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు విలువ‌ను మాత్రం వెల్లడించ‌లేదు.

ఎన్‌బీసీసీ:- ఢిల్లీలో సౌత్ ఈస్ట్ ఆసియా రిజ‌న‌ల్ ఆఫీసును నిర్మించ‌డానికి వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గనైజేష‌న్ నుంచి రూ.
250 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
ఆన్షల్ హౌసింగ్‌:- సోనూ బిల్డ్‌వెల్‌లో విడుద‌ల వారీగా వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు షేర్  ప‌ర్చేంజ్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌:- కంపెనీకి ప్రస్తుతం ఉన్న రూ.2500 కోట్ల మూలధనాన్ని రూ.6,050 కోట్లకు పెంచుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
కోల్ ఇండియా:- ఏప్రిల్ - న‌వంబ‌ర్‌లో ఉత్పత్తి సామ‌ర్థ్యం 176.65 మిలియ‌న్ ట‌న్నులకు పెరిగింది.
ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌:- తాత్కలిక ఛైర్మన్‌గా దిలీప్ స‌దారంగిణి నియ‌మితుల‌య్యారు.
సెక్యూరిటీ అండ్ ఇంట‌లిజెన్స్ స‌ర్వీసెస్‌:- త‌న అనుబంధ సంస్థ ఎస్ఐఎస్ గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ... అండ‌ర్‌స‌న్ సెక్యూరిటీస్ స‌ర్వీసెస్, అండ‌ర్‌స‌న్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిట‌డ్‌ల‌లో 60శాతం వాటాల‌ను కొనుగోలు చేసేందుకు స‌దరు కంపెనీల‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
వ‌క్రంగీ:- కంపెనీలో కీల‌క స్థానాల్లో ప‌నిచేసే వ్యక్తులను బ‌దిలీ చేసింది.
ఖాదీం ఇండియా:-  కంపెనీ బ్యాంక్ రుణాల‌కు ఇక్రా రేటింగ్‌ను కేటాయించింది. ధీర్ఘ‌కాలిక రుణాల‌పై  ఎ(స్థిర‌త్వం) రేటింగ్‌ను, స్వల్పకాలిక రుణాల‌కు ఎ(1)రేటింగ్‌ను కేటాయించింది.
మెక్‌న‌ల్లీ భార‌త్ ఇంజ‌నీరింగ్ కంపెనీ:- ఈఎస్ఆర్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
జుబిలెంట్ లైఫ్ సైన్సెస్‌:- రూ.100 కోట్ల క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల ఇష్యూను జారీ చేసింది.
నేడు క్యూ3 ఫలితాలు:- టాటా కంపెనీ ప‌వర్‌, కెన‌రా బ్యాంక్‌, ఓరియంట్ ఎల‌క్ట్రానిక్స్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, సెట్కో అటోమోటివ్‌, జెన్ టెక్నాల‌జీస్, మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్‌, షాల్బీ, టీటీకే ప్రెస్టేజీ, వైభ‌వ్ గ్లోబల్‌, పిర‌మిల్ ఎంట‌ర్‌ప్రైజెస్, ఎస్కార్ట్స్‌, చెన్నై పెట్రోలియం కార్పోరేష‌న్‌, సెంచూరీ టెక్స్‌టైల్స్‌&ఇండ‌స్ట్రీస్‌, రాజ్ రాయెన్ ఇండ‌స్ట్రీస్‌, సైయ్యంట్, శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఫైనాన్స్ కంపెనీ, బాలాజీ అమైన్స్‌, మైథ‌న్ అలాయ్స్‌, మ‌హారాష్ట్ర స్కూట‌ర్స్, గోద్రేజ్ ప్రాప‌ర్టీస్‌, సిటీ యూనియ‌న్ బ్యాంక్‌, న్లూక్లియ‌స్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్‌, కేపీఆర్ మిల్స్‌, ప్ర‌జ్ ఇండ‌స్ట్రీస్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవెల‌ప‌ర్స్‌, వాక్హార్డ్, స‌విత ఆయిల్ టెక్నాల‌జీస్‌, షాప‌ర్స్ స్టాప్‌, రాంకో సిస్ట‌మ్స్‌, పెర్సిస్టెంట్ సిస్ట‌మ్స్‌.


L&T

You may be interested

బడ్జెట్‌పై మార్కెట్‌ దృష్టి

Monday 28th January 2019

- ఫిబ్రవరి 1న  బడ్జెట్ - ఈనెల 29–30 తేదీల్లో ఫెడ్‌ సమావేశం - ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఫలితాలు ఈ వారంలోనే.. న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ఈవారంలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 1న (శుక్రవారం) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అధికార ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా.. ఈ బడ్జెట్లో వెల్లడికానున్న పలు కీలక ప్రతిపాదనలు దేశీ స్టాక్‌ సూచీలకు దిశా నిర్దేశం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు అప్‌

Monday 28th January 2019

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి సోమవారం ఉదయం 8.50 గంటలకు 28 పాయింట్ల పెరుగుదలతో 10,812 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10786 పాయింట్ల వద్ద ముగిసింది గత శుక్రవారం అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌ మినహా ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాలతో

Most from this category