STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th October 2018
Markets_main1540528754.png-21488

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌:- రెండు కంపెనీలు వేరువేరుగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులను లిస్ట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
షాలిమార్‌ పేయింట్స్‌:- రైట్స్‌ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతిషేరు ధర రూ.64.50ల చొప్పున మొత్తం 3.37 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
క్రిధన్‌ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ రూ.667 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కిచుకుంది.
టాటా టెలివిజన్‌:- రీడమబుల్‌ ఫ్రిపరెన్స్‌ షేర్ల జారీని నవంబర్‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు సెబీకి సమాచారం ఇచ్చింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.5వేల కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే కంపెనీ 4 అనుబంధ సంస్థలను విలీనానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.
ఐడీఎఫ్‌సీ బ్యాంకు:- క్యాపిటల్‌ ఫస్ట్‌ విలీనానికి సంబంధించి కేవలం ఎన్‌సీఎల్‌టీ అనుమతి మాత్రమే మిగిలి ఉందని తెలిపింది.
జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్దతిలో 18 లక్షల ఈక్విటీ షేర్లతో పాటు 13 లక్షల కన్వర్టబుల్‌ వారెంట్లను ప్రమోటర్లకు జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్‌పోర్ట్స్‌:- రుణ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకుక కొన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లు విక్రయిస్తున్నట్లు తెలిపింది.

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీల వివరాలు :-
ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, డీబీ రియల్టీ, ఎడెల్వీజ్‌, ఇమామి పేపర్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌, మహీంద్రా లైప్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, జిందాల్‌ స్టీల్‌ లెస్‌, కిర్లోస్కర్‌ స్టీల్‌, నెస్లే, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌, షాపర్స్‌ స్టాప్‌.



You may be interested

భారతి ఎయిర్‌టెల్‌ 3 శాతం జంప్‌

Friday 26th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిరుత్సాహకరమైన ఫలితాల్ని ప్రకటించినప్పటికీ, భారతీ ఎయిర్‌టెల్‌ శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి 3 శాతం లాభంతో రూ. 305 వద్దకు చేరుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.5 శాతం వరకూ నష్టపోయి రూ.287 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన ఈ షేరును హోల్డ్‌ నుంచి ‘బై’కి డాయిష్‌ బ్యాంక్‌ అప్‌గ్రేడ్‌ చేసి రూ. 425 టార్గెట్‌ ధరను ప్రకటించడంతో కనిష్టస్థాయిలో జరిగిన కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో లాభాల్లోకి మళ్లింది.

యస్‌ బ్యాంక్‌ 10 శాతం డౌన్‌

Friday 26th October 2018

ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌...సెప్టెంబర్‌ క్వార్టర్‌కు ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చడంతో ఈ షేరు శుక్రవారం 10 శాతం గ్యాప్‌డౌన్‌తో రూ.168 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ మొదలైన కొద్దిసేపటికే కనిష్టస్థాయి నుంచి కొంతమేర కోలుకుని 7 శాతం నష్టంతో రూ. 184 వద్ద యస్‌బ్యాంక్‌ షేర్లు చేతులు మారుతున్నాయి. తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బ్యాంక్‌ నికరలాభం 4 శాతం క్షీణతతో రూ.964 కోట్లకు తగ్గింది. నికర ఎన్‌పీఏలు

Most from this category