STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 13th November 2018
Markets_main1542085020.png-21927

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- తన కంపెనీ నెట్‌వర్క్‌ని మరింత వేగవంతం చేసుకోవడకానికి నెట్‌బ్రెయిన్‌ కంపెనీతో జట్టు కట్టింది.
ఎన్‌బీసీసీ:- ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి రూ.260 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
లుపిన్‌:- అటోవాక్వోన్ ఓరల్ సస్పెన్షన్ యుఎస్‌పీ ఔషధాలకు అమెరికా మార్కెట్లో విడుదల చేసింది.
అరబిందో ఫార్మా:- తన అనుబంధ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్ ఫార్మాస్యూటికల్స్ పీటీవై కంపెనీ ఆస్తులను సొంతం చేసుకుంది.
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- కంపెనీ ఉద్యోగులకు ఈఎస్‌పీఎస్‌ పథకం కింద ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.600 కోట్ల నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్‌:- వివిధ మార్గాల ద్వారా(ఎఫ్‌పీవో/రైట్స్‌ ఇష్యూ/క్యూఐపీ/ఈఎస్‌పీఎస్‌/ఈఎస్‌ఓపీ) రూ.1000 కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
టీవీస్‌ కంపెనీ:- బంగ్లాదేశ్‌లో ఆపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ మోడల్‌ ద్విచక్రవాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
టాటా మోటర్స్‌ కంపెనీ:- అక్టోబర్‌లో గ్లోబల్‌ అమ్మకాలు 5.62శాతం పెరిగాయి.
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ నిధుల సమీకరణకు ఆమోదం తెలిపేందుకు నవంబర్‌ 15న కంపెనీ బోర్డు సమావేశం కానుంది.
హడ్కో:- ప్రభుత్వ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3వేల కోట్లను సమీకరించింది.
శ్రీ సిమెంట్స్‌:- జార్ఖండ్‌, ఒడిశ్శా యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.903కోట్ల పెట్టుబడులు పె‍ట్టేందుకు బోర్డు అనుమతులు దక్కించుకుంది.
ఉషా మార్టిన్‌:- సొసైటీ జనరల్‌ సంస్థకు ఉషా మార్టిన్‌కు చెందిన 20లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.44.88లు చొప్పున కొనుగోలు చేసింది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అపోలో టైర్స్‌, అశోక్‌ లేలాండ్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, హిందుస్తాన్‌ కాపర్‌, అబాట్‌ ఇండియా, బాంబే డయింగ్‌, బాంబే బర్మా ట్రేడింగ్‌ కంపెనీ, దిలిప్‌ బిల్డ్‌కాన్‌, ఇంజినీర్స్‌ ఇండియా, గతి, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హాకిన్స్‌ కుకర్స్‌, ఇర్కన్‌ ఇంటర్నేషనల్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌, లవబుల్‌ లింగరీ, లెమన్‌ ట్రీ, మంగళం సిమెంట్‌, మిధాని, ఎన్‌సీసీ, ఎన్‌ఎమ్‌డీసీ, నొవార్టిస్‌ ఇండియా, పీటీసీ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, రీట్స్‌, శియారామ్‌ శిల్క్స్‌, టీవీఎస్‌ శ్రీచక్ర.You may be interested

లిక్విడిటీ ఫండ్స్‌కు లాకిన్‌?

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్‌ విషయంలో కఠిన నిబంధనలను తీసుకురావాలని సెబీ యోచిస్తోంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, స్వల్ప కాలం పాటు లాకిన్‌ తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదనగా తెలిసింది. 30 రోజులు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన బాండ్ల విలువను మార్క్‌ టు మార్కెట్‌

బ్రిటానియా లాభం రూ.303 కోట్లు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.261 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.303 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి

Most from this category