STOCKS

News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 23rd April 2019
Markets_main1555992622.png-25280

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎస్సెల్‌ ప్రోప్యాక్‌:- ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. సంస్థ ప్రధాన ప్రమోటర్‌ అశోక్‌ గోయల్‌ ట్రస్ట్‌ నుంచి ప్రతి షేరు ధర రూ.134 వద్ద మొత్తం 51శాతం వాటాను రూ.2157లకు కొనుగోలు చేయనుంది. రెండో విడతలో ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.139.19లు చొప్పున మొత్తం 26శాతం వాటాను రూ.1054లకు కొనుగోలు చేయనుంది. 
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- కంపల్సరీ కన్వర్టబుల్‌ డివెంచర్స్‌ పద్దతిలో 1.36 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. తద్వారా కంపెనీ రూ.3,668.64 కోట్ల సమీకరణ పూర్తి చేయనుంది. 
సిప్లా:- కంపెనీ అధ్యక్షుడు, గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాజు మిస్త్రీ నియమితులయ్యారు. 
గెయిల్‌:- ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ పోర్ట్‌ఫోలియో ఆస్తులను దక్కించుకునేందుకు అత్యధికంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్‌ను ధాఖలు చేసింది. 
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- లక్ష్మీ టీ కంపెనీ  3 టీ ఎస్టేట్లను రూ.150 కోట్లకు విక్రయించింది.
సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌:- జాయింట్‌ వెంచర్‌ కంపెనీ రైజింగ్‌ ఫార్మాలోని ఆస్తుల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- కంపెనీ బోర్డు విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్లను జారీ చేసి 30మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
బయోకాన్‌:- షేర్ల బోనస్‌ ఇష్యూపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఏప్రిల్‌ 25న సమావేశం నిర్వహించనుంది.
హిందుస్థాన్‌ కాపర్‌:- ఏప్రిల్‌ 25న జరిగే బోర్డు సమావేశంలో క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించనుంది.


నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-  ఏసీసీ సిమెంట్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్స్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేడెట్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, భారత్‌ సిమెంట్స్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, మీనన్‌ బేరింగ్స్‌, న్యూక్లియస్‌ సాఫ్ట్వేర్‌ ఎక్స్‌పోర్ట్స్‌, సక్సేన్‌ టెక్నాలజీస్‌, సోరియల్‌ ఇన్ఫ్రా రీసోర్స్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌, ఉష్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌You may be interested

ఇరాన్‌ చమురుపై భారత్‌కు షాక్‌

Tuesday 23rd April 2019

- దిగుమతులను పూర్తిగా ఆపేయాలి: అమెరికా - లేకపోతే ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిక వాషింగ్టన్‌: ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు అయిదు దేశాలకు అమెరికా షాకివ్వనుంది. ఇప్పటిదాకా దిగుమతి ఆంక్షల నుంచి ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని, లేకపోతే ఆంక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయా దేశాలను హెచ్చరించనుంది. అణ్వస్త్రాల తయారీ చేయొద్దన్న తమ మాటను బేఖాతరు

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 23rd April 2019

క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 126 పాయింట్లు జంప్‌చేసి 38,771 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10,612 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. జీ టెలి, సిప్లా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌లు 1-3 శాతం మధ్య ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసాయి. మరోవైపు గెయిల్‌ షేరు 3 శాతం నష్టాలతో మొదలుకాగా,ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు 2

Most from this category