STOCKS

News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 13th May 2019
Markets_main1557721028.png-25694

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గెయిల్‌:- ప్రధాన మంత్రి ఉజ్వల్‌ గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,500 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది.
ఎస్‌ఆర్‌ఎఫ్‌:- ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్ బిజినెస్‌ వ్యాపారాన్ని డీఎస్‌ఎం ఇండియా కంపెనీకి రూ.320 కోట్లకు విక్రయించనుంది. 
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- కంపెనీ ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా సుదీప్‌ సిల్‌ నియమితులయ్యారు. 
యూపీఎల్‌:- ఆల్‌ఫ్రెష్‌ మేనేజ్‌మెంట్‌లో 26.75శాతం వాటాను రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. 
వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌:- వెల్‌స్పన్‌ పైప్స్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 
ఎల్‌ అండ్‌ టీ:- తన అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టీ షిప్‌బిల్డింగ్‌ను విలీనం చేసుకునే ప్రక్రియను బోర్డు ఆమోదం తెలిపింది.
ఒబేరాయ్‌ రియల్టి:- రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరుపై రూ.2లు డివిడెండ్‌ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది.
అదానీ గ్రీన్‌:- ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 50 ఎండబ్యూఎసీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. 
రిలాక్సో ఫుట్‌వేర్స్‌:- 1:1 నిష్పత్తిలో షేర్ల బోనస్‌కు బోర్డు ఆమోదం తెలిపింది.
పీసీ జూవెలరీస్‌:- ఎగుమతుల వ్యాపార విభాగం  పీసీజే జెమ్స్ & జ్యూవెల్లరీని విలీనం చేసుకునేందుకు ఆదివారం బోర్డు ఆమోదం తెలిపింది. 
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌:- డెట్‌ సెక్యూరిటీ జారీ ద్వారా రూ.5వేల కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎడెల్‌వైజ్ ఫైనాన్షియల్:- అనుబంధ సంస్థ ఈసీఎల్ ఫైనాన్స్‌కు ఓ పెన్షన్ ఫండ్‌ రూ.1,040 కోట్లు అందినట్లు కంపెనీ తెలిపింది.

నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేసే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆటోమోటివ్‌ యాక్సిల్‌, బాలక్రిష్ణ పేపర్‌ మిల్స్‌, బోరోసిల్స్‌ గ్యాస్‌ వర్క్స్‌, కేపాసైట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, వోడాఫోన్‌ ఐడియా, కర్ణాటక బ్యాంక్‌, జస్ట్‌ డయల్‌, మెట్రోపాలీస్‌ హెల్త్‌కేర్‌, ఎంఆర్‌పీఎల్‌, ఎంటీ ఎడ్యూకేర్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఓబీసీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, సుబెక్స్‌, ట్రిడెంట్‌, యూనిటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.You may be interested

ఎస్‌బీఐ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?

Monday 13th May 2019

క్యు4 ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తూ టార్గెట్‌ ధరలను పెంచాయి. బ్యాంకు మార్చి త్రైమాసికంలో రూ. 838 కోట్ల లాభం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నోమురా: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 375 నుంచి రూ. 400కు పెంచింది. బ్యాంకు క్రెడిట్‌ వ్యయాలు వచ్చే రెండేళ్లలో వంద బీపీఎస్‌

నెగిటివ్‌ ప్రారంభం

Monday 13th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలకు గండిపడటంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 80 పాయింట్ల తగ్గుదలతో 37,370  పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11, 248 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియాలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌,

Most from this category