STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 1st January 2019
Markets_main1546316198.png-23339

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హెచ్‌డీఎఫ్‌సీ:- గృహ రుణాలకు వర్తించే రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ద్రవ్య కొరతతో డిసెంబర్‌ 31న డిబెంచర్‌ హోల్డర్లకు ఎన్‌సీడీలపై వడ్డీని చెల్లించడంలో విఫలమైంది.
జిందాల్‌ స్టీల్‌ & పవర్‌:- ప్రస్తుతం కంపెనీ సీఈవో పదవీబాధ్యతలు నిర్వర్తిసున్న నౌషాద్ అక్తర్ అన్సారీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.
అవాస్‌ ఫైనాన్షియర్:- ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా సుశీల్‌ కుమార్‌ అగర్వాల్‌ నియామకానికి మెంబర్లు ఆమోదం తెలిపారు.
డైనమటిక్‌ టెక్నాలజీస్‌:- అటో డివిజన్‌ ఉపసంహరణకు హై-టెక్‌ అరై ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో బిజినెజ్‌ ట్రాన్స్‌ఫర్‌ అగ్రిమెంట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
త్రిపాఠి సర్జన్‌:- కంపెనీ సీఈవోగా దిలీప్ గణేష్‌ భాయ్‌ రాజీనామా చేశారు.
జేఎంసీ ప్రాజెక్ట్స్‌:- రూ.596 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర:- మూలధన నిధుల అవసరానికి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ నుంచి రూ.4,498 కోట్లను సమీకరించింది.
అలహాదాబాద్‌ బ్యాంక్‌:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
విజయా బ్యాంక్‌:- కంపెనీ సీఈవోగా నాగేశ్వర రావ్‌.వై  పదవీకాలాన్ని మరింత కాలం పొడిగించింది.
బీహెచ్‌ఈఎల్‌:- పశ్చిమబెంగాల్‌లో 660 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం రూ.3,500 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది.
లుపిన్‌:- క్లోబాజమ్ ఓరల్ సస్పెన్షన్‌ మార్కెటింగ్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి సోమవారం అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది.
హెచ్‌పీఎల్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ పవర్‌:- కంపెనీ రూ.80 కోట్ల వాణిజ్య పేపర్లను జారీ చేసింది.


IOC

You may be interested

35000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 1st January 2019

35వేల దిగువకు సెన్సెక్స్‌ 10850 కోల్పోయిన నిఫ్టీ కొత్త ఏడాది మార్కెట్‌ ఒడిదుడుల మధ్య ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ 36వేల మార్కును, నిఫ్టీ సూచీ 10,850 కీలకస్థాయిని కోల్పోయింది. ఉదయం గం.10:00లకు సెన్సెక్స్‌ సూచీ 122 పాయింట్లు కోల్పోయి 35,952 వద్ద, నిఫ్టీ సూచీ 37 పాయింట్లు

కొత్త సంవత్సరంలో శుభారంభం

Tuesday 1st January 2019

సెన్సెక్స్‌ 93 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు అప్‌ కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన మంగళవారం మార్కెట్‌ శుభారంభాన్నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 36,162 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 19 పాయింట్ల పెరుగుదలతో 10,882 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.5 శాతం పైగా పెరగడంతో పాటు ఆటోమొబైల్‌ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్లు పాజిటివ్‌గా మొదలయ్యాయి. భారతి

Most from this category