STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 14th December 2018
Markets_main1544760433.png-22908

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌:- బై బ్యాక్‌ ఇష్యూతో పాటు షేరు మధ్యంతరం డివిడెంట్ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.149లు చొప్పున మొత్తం 29.7 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.4,435 కోట్ల వ్యయాన్ని ఖర్చు పెట్టనుంది. బై బ్యాక్‌ ఇష్యూకు డిసెంబర్‌ 25ను రికార్డు తేదిగా నిర్ణయించింది. అలాగే ప్రతి షేరుపై రూ.6.75లు చొప్పున మధ్యంతర డివిడెంట్‌ను చెల్లించనుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ విమానయాన రంగంలో సేవలను అందించే ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ కంపెనీని రూ.400 కోట్లకు కొనుగోలు చేసింది.
కేఎన్‌ఆర్‌ టెక్నాలజీస్‌:- క్రిడెట్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ రుణ రేటింగ్‌ ఎ(+) స్థిరత్వం నుంచి ఎ(+) పాజిటివ్‌కు సవరించింది.
క్యాపిటల్‌ ఫస్ట్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌:- ఇరు సంస్థల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ (ఎల్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. క్యాపిటల్‌ ఫస్ట్‌ హోమ్‌ ఫైనాన్స్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ సంస్థలు ఐడీఎఫ్‌సీలో బ్యాంక్‌ విలీన ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే.
లుపిన్‌:- ఊపిరితిత్తులు వ్యాధి చికిత్సలో వాడే డైమెథిల్‌ ఫ్యూమరేట్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్స్‌:- కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా శైవలీ పరేఖ్‌ నియమితులయ్యారు.
అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- ఇటీవల సొంతం చేసుకున్న బినాని సిమెంట్‌ పేరును అల్ట్రాటెక్‌ నాధ్‌ద్వార్‌ సిమెంట్‌గా పేరు మారుస్తున్నట్లు ప్రకటించింది.
శ్రేయీ ఎక్విప్‌మెంట్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.150 కోట్లను సమీకరించనుంది. ఇష్యూ డిసెంబర్‌ 19న ప్రారంభమై, జనవరి 19న ముగుస్తుంది.
ఇండియన్‌ ఎనర్జీ ఎక్చ్సేంజ్‌:- షేర్ల బై బ్యాంక్‌ ప్రక్రియకు ఆమోదం తెలిపేందుకు డిసెంబర్‌ 20న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.


IOC

You may be interested

రూపీ డౌన్‌..

Friday 14th December 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో రూపాయి 71.79 వద్ద ఉంది. గురువారం ముగింపు స్థాయి 71.69తో పోలిస్తే 0.15 శాతం క్షీణించింది. ఇకపోతే శుక్రవారం రూపాయి 71.75 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.409 శాతంగా ఉంది. ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.408 శాతం. బాండ్‌ ధరలు, ఈల్డ్‌ పరప్సరం వ్యతిరేక దిశలో ఉంటాయి.  బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌

నెగటివ్‌ ఓపెనింగ్‌

Friday 14th December 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,791 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,784 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,929 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 35,960 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే తర్వాత సెన్సెక్స్‌ కూడా నష్టాల్లోకి వచ్చేసింది. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 10,771 వద్ద,

Most from this category