STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th December 2018
Markets_main1544588600.png-22837

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇండియన్‌ఆయిల్‌కార్పోరేషన్‌(ఐఓసీ):- ప్రభుత్వం కంపెనీలో తన మొత్తం వాటాలోంచి 2.96శాతం వాటాను ఉపసంహరించుకుంది.
అరబిందో ఫార్మా:- చైనా కంపెనీతో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయనుంది. తన అనుబంధ సంస్థ హెలిప్స్‌ హెల్త్‌కేర్‌ అనే సంస్థ ఈ మేరకు చైనా కంపెనీ షాన్‌డాంగ్‌ లుగ్జిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను విడివిడి సంస్థలుగా ఏర్పాటు చేయడానికి రిలయన్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం యూనిట్‌ రిలయన్స్‌ జియో అనుమతి తెలిపింది.

కేడిల్లా హెల్త్‌కేర్‌:- హింజ్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
టెక్‌ మహీంద్రా:- మార్కెటింగ్‌ అధికారి జగదీశ్‌ మిత్రా వచ్చే ఏడాది జనవరి 1నుంచి ఎంటర్‌ప్రైజెస్‌ వ్యాపారాధిపతిగా కొనసాగుతారని వెల్లడించింది.
టాటా స్పాంజ్‌ ఐరన్‌:- ఉషా​మార్టిన్‌ లిమిటెడ్‌ కొనుగోలు ప్రక్రియకు కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.
స్ట్రైడ్‌ ఫార్మా:- స్ట్రైడ్‌ వివిమెడ్‌ సంయుక్త కంపెనీ నుంచి తయారవుతున్న తమ ఆల్బెండజోల్‌ మాత్రలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
టైటాన్‌:- క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ దీర్ఘకాలికానికి కంపెనీ రేటింగ్‌ను నెగిటివ్‌ నుంచి స్థిరత్వంకు సవరించింది.
లుపిన్‌:- ఎలిక్విస్‌ 2.5 ఎంజీ, 5 ఎంజీ మాత్రలకు జెనరిక్‌ వెర్షిన్‌ అయిన అపిక్సబన్‌ 2.5 ఎంజీ, 5 ఎంజీ మాత్రలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది.
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌:- ప్రమోటర్ గ్రూపు వాటాదారులను పబ్లిక్ వాటాదారులుగా పునః వర్గీకరణ కోసం బీఎస్ఈ & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకు ఆమోదం పొందింది.
ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- కంపెనీ రూ.250 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసింది.
కావేరీ సీడ్స్‌:- తన రెండు అనుబంధ సంస్థలను విలీన ప్రక్రియపై చర్చించేందుకు డిసెంబర్‌ 20న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
విప్రో:- అమెరికా దేశపు మిచిగాన్‌, డెట్రాయిట్‌ రాష్ట్రాల్లో అటోమేటివ్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఆవిష్కరించింది.
యూనికెమ్‌ లాబొరేటరీస్:- టాడాఫిల్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనమతులు దక్కించుకున్నట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
కేడిల్లా హెల్త్‌కేర్‌:- అల్సర్‌ చికిత్సలో వాడే ఇంజెక‌్షన్‌ రాంటిడైన్‌ 25 ఎంజీ/ఎంఎల్‌, 2 ఎంఎల్‌ సింగల్‌ డోస్‌ వయల్స్‌, 6 ఎంఎల్‌ మల్టీ డోస్‌ వయల్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.You may be interested

ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు నిబంధనలు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్‌ అండ్ కాస్మెటిక్స్‌ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయా లోక్‌సభకు తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్ పేరు మొదలైనవన్నీ కూడా ఈ-ఫార్మసీలు

రూపీ మళ్లీ తగ్గింది..

Wednesday 12th December 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం మళ్లీ బలహీనపడింది. మూడు ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికార బీజేపీ ఓడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ నియామకం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 72.10 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.87తో పోలిస్తే 0.33 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి బుధవారం 72.02 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల

Most from this category