STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th December 2018
Markets_main1545019505.png-22983

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వేదాంత:- ఇటీవల కాలుష్య కారణంతో వివాదస్పదమై మూసివేయబడిన తూత్తికోడి కాపర్‌ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ అనుమతినిచ్చింది. అలాగే తమిళనాడు పొల్యూషన్స్‌ కంట్రోల్‌ బోర్డు మరో 3వారాల్లోగా ప్లాంట్ నిర్వహణ కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్‌ను సప్లై చేయాల్సిందిగా స్థానిక విద్యుత్‌ కార్యలయానికి ఆదేశాలు జారీ చేసింది.
తేవా ఫార్మా:- మహిళల్లో జన్యుపరమైన లోపం వ్యాధి చికిత్సలో వినియోగించే ‘‘హర్జుమా’’ జనరిక్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
కేడిల్లా హెల్త్‌కేర్‌:- అల్బెండజోల్‌, ప్రిగాబాలిన్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీ నుంచి అనుమతులు దక్కించుకుంది.
వోడాఫోన్‌ఐడియా, భారతీఎయిర్‌టెల్‌, ఐడియా:- ట్రాయ్‌ రూపొందించిన కొత్త ధరల నిబంధనలను టెలికాం ట్రైబ్యునల్‌ ఆదేశాలను జారీ చేయడంతో నేడు టెలికాం రంగ షేర్లు అధిక వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవచ్చు.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ‍ప్రమోటర్‌ కంపెనీ ఎమ్‌స్కో ఇన్ఫ్రాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్రమైన వివరాలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించింది.
టాటాస్పాంజ్‌ ఐరన్‌:- కంపెనీ రుణపరిమితిని పెంచుకోవడానికి, టాటాస్టీల్‌కు ఫ్రిపరెన్షియల్‌ షేర్లను జారీ చేసేందుకు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు దక్కించుకుంది.
విప్రో:- సాక్సో బ్యాంక్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎన్‌టీపీసీ:- బీహార్‌కు చెందిన ‘‘బీహార్‌ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్‌’’ కంపెనీ నుంచి 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్రూనీ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను కొనుగోలు చేసింది.
ఇన్ఫోసిస్‌:- క్లౌడ్‌ఎండోర్‌ లిమిటెడ్‌ కంపెనీలో తన మొత్తం వాటా నుంచి 15.30 మిలియన్ల డాలర్లకు సమానమైన వాటాను ఉపసంహరించుకునేందుకు సదరు కంపెనీ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది.
త్రివేణి టర్బైన్‌:- డిసెంబర్‌ 28వ తేదిని బైబ్యాక్‌ ఇష్యూకు రికార్డు తేదిగా నిర్ణయించింది.
సెక్యూరిటీ అండ్‌ ఇంటలిజెన్స్‌ సర్వీసెస్‌:- యూనిక్‌ డిటెక్టివ్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటా కొనుగోలుకు సిద్ధమైంది.
ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌:- అమర్‌చిత్రకథ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.45కోట్ల విలువైన వాటాను విక్రయించింది.
డాటా మెస్టిక్‌ గ్బోల్‌ సర్వీసస్‌:- తన అనుబంధ సంస్థ లుమనా డాటామెస్టిక్‌ కంపెనీ విభజించడంతో పాటు ప్రత్యేకంగా ఎక్చ్సేంజ్‌లో లిసింగ్‌ చేయనుంది.
హెచ్‌పీసీఎల్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ పవర్‌:- రూ.85కోట్ల విలవైన కమర్షియల్‌ పేపర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
టెక్నో ఎలక్ట్రిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ:- బైబ్యాక్‌ ఇష్యూకు జనవరి 3వ తేదిని రికార్డు తేదిగా నిర్ణయించింది.
సోలార్‌ యాక్టివ్‌ ఫార్మా సైన్స్‌:- సంస్థ ప్రధాన యూనిట్‌లో ఇటీవల తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా జీరో అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.You may be interested

వేదాంతకు.....స్టెరిలైట్‌ రీ-ఓపెనింగ్‌ వెలుగులు

Monday 17th December 2018

6.50శాతం ర్యాలీ లాభపడిన షేరు తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారం శాశ్వత మూసివేత ఆదేశాలను జాతీయ హరిత ట్రెబ్యునల్‌ రద్దు చేయడంతో వేదాంత లిమిటెడ్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6శాతం ర్యాలీ చేసింది. తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని స్టెరిలైట్‌ను వెంటనే మూసివేయాల్సిందిగా ఈ ఏడాది మే నెలలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రమవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో

10850పైకి నిఫ్టీ గ్యాప్‌అప్‌

Monday 17th December 2018

36,000 పైకి సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,805 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 10,853 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,962 పాయింట్లతో పోలిస్తే 167 పాయింట్ల లాభంతో 36,129 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.   అమెరికా.. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ప్రొడక్టుల దిగుమతులపై టారిఫ్‌ పెంపును జనవరి 1

Most from this category