STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 11th January 2019
Markets_main1547178060.png-23515

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- జామ్నా నగ‌ర్‌లోని చ‌మురు శుద్ది యూనిట్‌ను నెల‌రోజు పాటు ష‌ట్‌డౌన్ చేసేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తుంది.  యూనిట్లో యంత్రాల ప‌నితీరును త‌నిఖీ చేసే ప్రక్రియ‌లో భాగంగా జ‌న‌వ‌రి 16నుంచి 4వారాల పాటు మూసివేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.
హెచ్ఎఫ్‌సీఎల్‌:- ఎల్అండ్ టీ, ఐటీఐ క‌న్షారియంల నుంచి రూ.500 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. భార‌త్ నెట్ ఫేజ్‌-2 ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ  ఇరు కంపెనీల‌కు ఆఫ్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుంది.
టాటా మోట‌ర్స్‌:- బ్రిట‌న్‌లోని త‌న అనుబంధ సంస్థ జాగ్వర్ లాండ్ రోవ‌ర్ అమ్మకాలు డిసెంబ‌ర్లో 6.4శాతం క్షీణించాయి. గతేడాది ఇదే డిసెంబ‌ర్‌లో కంపెనీ 52,160 యూనిట్ల అమ్మకాలు జ‌ర‌గ్గా అంత‌కుముందు ఏడాదిలో 55,697 యూనిట్ల విక్రయాలు జ‌రిగాయి.
ఎంకాయ్ గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌:- కంపెనీ సీఈవోగా సువీర్ శ‌ర్మ నియమితుల‌య్యారు.
ఇండియ‌న్ ఎన‌ర్జీ ఎక్చేంజ్‌:- కంపెనీ మేనిజింగ్ డైరెక్టర్, సీఈవోగా స‌త్యనారాయ‌ణన్ గోయిల్ ప‌ద‌వీకాలాన్ని మ‌రో ఆరు నెల‌ల పాటు పొడ‌గించింది.
కేఎన్ఆర్ కన్‌స్ట్రక్చన్స్‌:- త‌న అనుబంధ సంస్థ ఒకటి తెలంగాణాలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.12, 340 కోట్ల విలువైన ఆర్డర్ల కొరకు నేష‌న‌ల్ హై ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియ‌ల్ క్లోజ‌ర్ లెట‌ర్ను అందుకుంది.
ఎన్‌బీసీసీ:- కంపెనీ గ‌తేడాది డిసెంబర్‌లో వివిధ వ్యాపార రంగాల నుంచి రూ.188 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్‌:- బ్యాంక్ స్వతంత్ర డెరెక్టర్ ప‌ద‌వికి రామా బిజాపుర్కార్ రాజీనామా చేశారు.
ముకుంద్‌ లిమిటెడ్‌:- తన మూడు అనుబంధ సంస్థల విలీనానికి స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ల నుంచి నో అబ్జక‌్షన్‌ లెటర్‌ను దక్కించుకుంది.
లెమన్‌ ట్రీ హోటల్స్‌:- ఆంద్రప్రదేశ్‌లో 50-రూముల సామర్థ్యంల రిసోర్ట్‌ ప్రాపర్టీ కొరకు లైసెన్స్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది.
నేడు క్యూ3 ఫ‌లితాల‌ను ప్రక‌టించే  కొన్ని ప్రధాన కంపెనీలు:- అమ‌ల్ లిమిటెడ్‌, ధ్రువ్ ఎస్టేట్ లిమిటెడ్‌, ఇన్ఫోమీడియా ప్రెస్ లిమిటెడ్‌, క‌ర్ణాటక బ్యాంక్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీయ‌ల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీఆర్ఎఫ్ లిమిటెడ్‌, ఇంటిగ్రేడెడ్ క్యాపిట‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌.You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 11th January 2019

సెన్సెక్స్‌ 85 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు అప్‌ ఆసియా మార్కెట్లు సానుకూల ట్రేడింగ్‌ ప్రభావంతో భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 36,192 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల పెరుగుదలతో 10,834 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 1 శాతం నష్టంతో రూ. 1,870 వద్ద ట్రేడింగ్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Friday 11th January 2019

 ఆసియా మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50 గంటలకు 10,887 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,821 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి నికాయ్‌ 0.7

Most from this category