STOCKS

News


సోమవారం వార్తలోని షేర్లు

Monday 14th January 2019
Markets_main1547442628.png-23564

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాల

ఇన్ఫోసిస్‌:- శుక్రవారం క్యూ3 ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.800ల చొప్పున మొత్తం 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ ఇష్యూ విలువ సుమారు రూ.8,260 కోట్లుగా ఉంది. అలాగే  షేరు ఒక్కింటికి రూ.4లు చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించనుంది. ఇందుకు రికార్డు తేది జనవరి 25గానూ, చెల్లింపుల తేది జనవరి 28గా నిర్ణయించింది. ఇందుకు కంపెనీ రూ. 2,107 కోట్లను ఖర్చు చేయనుంది.
కేడిల్లా హెల్త్‌కేర్‌:- బెటమేథసోన్ డిప్రొపియోనేట్ ఆయింట్‌మెంట్‌కు, అమ్లోడిపైన్ & అటోవాస్టాటిన్ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతులు దక్కించుకుంది.
ఫెడరల్‌ బ్యాంక్‌:- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి గణేష్‌ శంకరన్‌ రాజీనామా చేశారు.
యస్‌ బ్యాంక్‌:- నాన్‌-ఎగ్జిక్యూటివ్ పార్ట్‌-టైమ్‌ ఛైర్మన్‌గా బ్రహ్‌ దత్‌ను నియమించింది.
అదానీ గ్రీన్‌ ఎనర్జీ:- ఎఫ్‌ఎస్‌ ఇండియా దేవ్‌కో. ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొండగల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌లో మిగిలిన 51శాతం వాటాను కొనుగోలు చేసింది.
పీఎన్‌సీ ఇన్ఫ్రాస్టక్చర్స్‌:- కంపెనీ డైరెక్టర్‌ పదవికి రాకేష్‌ కుమార్‌ రాజీనామా చేశారు.
ఎన్‌టీపీసీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్ల జారీ ద్వారా కంపెనీ రూ.4000 కోట్లను సమీకరించింది.
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్‌:- నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తన రెండు అనుబంధ సంస్థలు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ లెటర్‌ను అందుకున్నాయి.
క్రెబ్స్‌ బయోకెమిక‌ల్స్‌:- రైట్స్‌ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు షేర్లను జారీ చేసి రూ.30 కోట్లను సమీకరించనుంది. ఈ రైట్స్‌ ఇష్యూకు కంపెనీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 28.50లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వచ్చే నెల 1వ తేదీని రికార్డు తేదిని ఇష్యూకు రికార్డు తేదిగా నిర్ణయించింది.
మార్గ్‌:- నాన్‌ ప్రమోటర్లకు ఫ్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.61.68లు చొప్పున మొత్తం 1.26 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు: ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా, టాటామెటాలిక్స్‌, ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌



You may be interested

బ్రేకవుట్‌ సంకేతాలివే!

Monday 14th January 2019

50, 100 డీఎంఏ మధ్య తగ్గుతున్న అంతరం సూచీలు కొన్ని వారాలుగా స్వల్ప శ్రేణిలో కదలాడుతున్నాయి. నిఫ్టీ బ్రేకవుట్‌ ఇస్తుందా, బ్రేక్‌డవున్‌ అవుతుందా? ఇతమిద్దంగా తెలియక ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ క్రమంగా బ్రేకవుట్‌కు దగ్గరవుతోందని, ఇందుకు సంకేతాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చార్టుల్లో 50, 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ల(డీఎంఏ) మధ్య బేధం తగ్గుతూ వస్తోందని, ఇది చాలా కీలక సంకేతమని చెబుతున్నారు. గత

ఇన్ఫీ షేరును ఏం చేద్దాం?

Monday 14th January 2019

గత వారం చివర్లో ఇన్ఫోసిస్‌ క్యు3 ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నా, బైబ్యాక్‌ ఆఫర్‌ కారణంగా షేరులో కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ షేరును ఎలా డీల్‌ చేయాలనే విషయమై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 680. మార్జిన్‌ అంచనాలు తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ వృద్ధి పాజిటివ్‌ అంశమే కానీ మార్జిన్‌ కోత కారణంగా అంచనాలు తగ్గించుకోవాల్సి

Most from this category