STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 16th November 2018
Markets_main1542341842.png-22063

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌:- నవంబర్‌ 16న జరిగే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చించనున్నారు.
సికాల్‌ లాజిస్టిక్స్‌:-  మూలధన అవసరాలకు నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు బోర్డు సభ్యులు నవంబర్‌ 17న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
షాలిమార్‌ పేయింట్స్‌:- మూలధన అవసరాలకు నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు బోర్డు సభ్యులు నవంబర్‌ 17న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌:- టెర్రిఫ్లూనోమైడ్‌ ఔషధాలకు ఎఎన్‌డీఏ నుంచి తుది అనుమతులు దక్కించుకుంది.
ఇన్ఫోసిస్‌:- సంస్థ తాత్కాలిక సీఎఫ్‌ఓగా జయేష్‌ సంగ్రజ నియమితులయ్యారు. గత ఆగస్ట్‌లో సంస్థ సీఎఫ్‌ఓ పదవికి ఆకస్మిక రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఆయన పదవి కాలంలో నవంబర్‌ 16న ముగిసింది. బోర్డు కొత్త సీఎఫ్‌ఓను నియమించేంత వరకు జయేష్‌ సంగ్రజ తన బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
లెమన్‌ ట్రీ:- ఒడిస్సాలో 76 గదుల హోటల్‌ నిర్మాణానికి స్థానికి ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కించుకుంది. మార్చి 2020 హోటల్‌ ప్రారంభమవుతుంది.
టాటా స్పాంజ్‌:- ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో ప్రమోటర్‌ కంపెనీ టాటాస్టీల్‌కు రూ.1000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
యస్‌ బ్యాంక్‌:- యెస్ బ్యాంక్ సీఈవో, ఎండీ రాణా కపూర్ స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి ఏర్పాటైన కమిటీకి ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ రాజీనామా చేశారు.
ఎస్‌ఆర్‌ఎఫ్‌:- గుజరాత్లో ఆగ్రోకెమికల్ ప్లాంటు అభివృద్ధి, అనుసంధానం కోసం మూలధన వ్యయాన్ని పెంచింది. గతంలో ఈ నిర్వహణ పనులకు రూ. 180 కోట్లను కేటాయించగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.257 కోట్లకు విస్తరించింది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌:- ఎన్‌సీడీలపై నవంబర్‌ 14వ తేదిన చెల్లించాల్సిన రూ.4.7 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- శ్రేయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఫైనాన్స్‌, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా, టూరిజమ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఇండియా.You may be interested

4 వారాల గరిష్టానికి సూచీలు

Friday 16th November 2018

35,500 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,700 దిశగా నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలు మరంత పెరిగాయి. ఉదయం 10:05 సమయంలో సెన్సెక్స్‌ 240 పాయింట్ల లాభంతో 35,501 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,682 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,529 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 10,689 గరిష్ట స్థాయిని తాకాయి. ఇండెక్స్‌లు అక్టోబర్‌ 17 తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం.  ఇక నిఫ్టీ-50లో ఐషర్‌ మోటార్స్‌,

స్వల్పకాలానికి 3 సిఫార్సులు

Friday 16th November 2018

టెక్నికల్స్‌ ఆధారంగా మూడు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సూచించింది. స్టాప్‌లాస్‌ను నిర్వహిస్తూ వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వల్పకాలంలో 6-9 శాతం వరకు రాబడిని పొందవచ్చని సిఫార్సుచేసింది. మారుతి సుజుకి | ప్రస్తుత ధర: రూ.7,524 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.7,950 | స్టాప్ లాస్‌: రూ. 7,250 | రాబడి అంచనా 6.5 శాతం నెస్లే | ప్రస్తుత ధర: రూ.10,487 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.

Most from this category